Homeజాతీయ వార్తలుNitish Kumar Rajya Sabha Nomination: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్‌ శకం.. బీజేపీ ఖాలాలోకి...

Nitish Kumar Rajya Sabha Nomination: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్‌ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్‌!

Nitish Kumar Rajya Sabha Nomination: బిహార్‌లో రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరారం చేసి 21 ఏళ్లుగా బిహార్‌కు దశ దిశ నిర్దేశించిన నితీశ్‌కుమార్‌ రాజకీయం రాష్ట్రంలో ముగిసింది. రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మార్చి 5న నామినేషన్‌ వేశారు. నితీశ్‌కుమార్‌ ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఆయన పూర్తికాలం ఉంటారని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ 5వ తేదీన నితీశ్‌కుమార్‌ […]

Nitish Kumar Rajya Sabha Nomination: బిహార్‌లో రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరారం చేసి 21 ఏళ్లుగా బిహార్‌కు దశ దిశ నిర్దేశించిన నితీశ్‌కుమార్‌ రాజకీయం రాష్ట్రంలో ముగిసింది. రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మార్చి 5న నామినేషన్‌ వేశారు. నితీశ్‌కుమార్‌ ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఆయన పూర్తికాలం ఉంటారని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ 5వ తేదీన నితీశ్‌కుమార్‌ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. రాజ్యసభకు నామినేసన్‌ వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!

రహస్య సమావేశాల నేపథ్యం..
మార్చి 4న వన్‌ ఆన్‌ మాల్‌ భవనంలో జరిగిన కీలక సమావేశం నితీశ్‌ నిర్ణయానికి మూలం. కేంద్ర మంత్రులు సంజయ్‌ ఝా, రామ్‌నాథ్‌ ఠాకూర్, విజయ్‌ కుమార్‌ చౌహాన్, బిజేంద్ర యాదవ్‌ పాల్గొన్నారు; అమిత్‌ షా ఫోన్‌లో చేరి ఆరోగ్యం, పరిపాలనా సవాళ్లపై చర్చించారు. ఇటీవల ఆయన వ్యవహార శైలి మార్పు, మతి సమస్యల ప్రచారం, ఐఏఎస్‌ అధికారుల ప్రభావం ప్రజల్లో అసంతృప్తి తెచ్చాయి. మార్చి 5న ఎక్స్‌ పోస్ట్‌లో రాజ్యసభ ప్రయాణాన్ని ప్రకటించారు.

ఉప ముఖ్యమంత్రిగా నితీశ్‌ కొడుకు..
నితీశ్‌ కుమారుడు 40 ఏళ్ల ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ నిశాంత్‌ కుమార్‌ను ఉపముఖ్యమంత్రిగా చేసి పార్టీ ఐక్యత కాపాడాలని జేడీయూ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ అనుభవం లేనప్పటికీ, తండ్రి వెంట తిరుగుతూ క్రమంగా ప్రజాధరణ సంపాదించాలని ప్రణాళిక. కుటుంబ పాలనకు వ్యతిరేకత ఉన్నా, పార్టీ స్థిరత్వం కోసం ఈ దీర్ఘకాల ప్రణాళిక రూపొందుతోంది. జేడీయూ శ్రేణులు నిశాంత్‌ ప్రజాధరణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సీఎం రేసులో నలుగురు..
ఇక బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం రాబోతోంది. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి (నితీశ్‌ సమాజిక వర్గనేత), నిత్యానంద రాయ్‌ యాదవ్, దిలీప్‌ సైస్వాల్, విజయ్‌ కుమార్‌ సిన్హా సీఎం అవకాశాల్లో ముందున్నారు. బీజేపీ ఆధారంతో జేడీయూ మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుంది. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఇది నితీశ్‌ స్వచ్ఛంద నిర్ణయమని, భవిష్యత్‌ ప్రభుత్వానికి ఆయన మార్గదర్శకత్వం ఉంటుందని తెలిపారు. రాజ్యసభ స్థానం జేడీయూ ప్రభావాన్ని కొనసాగిస్తుందని ఆశ.

కూటమి సమీకరణం…
గత అసెంబ్లీలో 249 స్థానాల్లో బీజేపీ 89, జేడీయూ 86, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ పార్టీ 19, ఆర్‌ఎల్‌జేపీ 4 సాధించాయి. ఆర్‌ఎల్‌జేపీ బీజేపీలో విలీనం ప్రణాళిక ఆర్‌జేడీ చీల్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది. ఈ మలుపుతో బీజేపీ మరో రాష్ట్రంలో సీఎం పదవి సాధించనుంది. రోహిణి ఆచార్యలు నితీశ్‌ను బీజేపీ ’కీలుబొమ్మ’గా విమర్శిస్తూ, మిత్రద్రోహానికి మూల్యం చెల్లించారని ఆరోపించారు. ఈ పరిణామం బీజేపీ బలోపేతానికి జేడీయూ బలహీనతకు దారితీస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper