Shilpa Shetty: అశ్లీల చిత్రాల సృష్టికర్త ‘రాజ్ కుంద్రా’, ఆయన ముద్దుల సతీమణి ‘శిల్పాశెట్టి’కి కోపం వచ్చింది. శృంగార చిత్రాల కథానాయిక షెర్లిన్ చోప్రా పై పరువు నష్టం దావా వేశారు. ఎంతో తెలుసా 50 కోట్ల దావా అది. పాపం షెర్లిన్ చోప్రా ఇప్పటివరకు చేసిన శృంగార చిత్రాలకు కూడా ఆమె అంత పెద్ద మొత్తం సంపాదించి ఉండదు. అలాంటి ఆమె పై 50 కోట్ల దావా వేస్తే ఎలా ఇస్తోంది ?

ఇంతకీ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఎందుకు దావా వేశారు అంటే.. షెర్లిన్ చోప్రా వారి పై పలు ఆరోపణలు చేసింది. తనను శృంగార చిత్రాలలో నటించాలి అంటూ మానసికంగా, శారీరకంగా వేధించారని షెర్లిన్ చోప్రా చెప్పుకొచ్చింది. అంతేకాదు, ‘రాజ్ కుంద్రా’, ‘శిల్పాశెట్టి’ పై పోలీసు కేసు పెట్టింది. ఆ మధ్య ఈ వార్త బాగా వైరల్ అయింది కూడా.

అప్పుడు సైలెంట్ గా ఉన్న శిల్పాశెట్టి(Shilpa Shetty) తాజాగా తన భర్తతో కలిసి షెర్లిన్ చోప్రా పై పరువు నష్టం దావా వేసింది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి తన లాయర్లతో కొన్ని స్టేట్ మెంట్స్ కూడా ఇప్పించింది. ‘షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అర్థరహితం, నిరాధారం, దురుద్దేశ పూరితమైనవి, ‘రాజ్ కుంద్రా’ ఎప్పుడూ ఎవర్నీ శృంగార చిత్రాలు చేయమని బలవంత పెట్టలేదు’ అని శిల్పాశెట్టి లాయర్లు చెప్పుకొచ్చారు.

తమ క్లయింట్ పరువు నష్టం కలిగించినందుకు 50 కోట్ల రూపాయలని కోరుతూ వారు కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు. అయితే, రాజ్ కుంద్రా గతంలో షెర్లిన్ చోప్రాతో కొన్ని శృంగార చిత్రాలు నిర్మించాడని వార్తలు వచ్చాయి. ఆ చిత్రాల్లో నటించినందుకు గానూ షెర్లిన్ చోప్రాకి ఇస్తానని చెప్పిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశాడని, ఆ కోపంతోనే షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిందని టాక్.
రాజ్ కుంద్రా ఇటీవల రెండు నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చారు. ఆ కేసు ఇంకా నడుస్తుంది. మరోపక్క ‘శిల్పాశెట్టి’ తన భర్త రాజ్ కుంద్రాకి విడాకులు ఇస్తోందని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఈ కేసుతో ఆ ప్రచారం అవాస్తవం అని తేలిపోయింది.