Thank You Movie: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయంలో ఎలా ఉన్నదో తెలీదు కానీ … ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా… పవన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త మీడియా లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో చైతూ హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మన దేశంలో మూలాలు ఉండి… విదేశాల్లో సెటిల్ అయిన కుర్రాడు, తన మూలాలను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే నేపధ్యంలో ఈ సినిమా ఉండనుందని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో దిల్ రాజు అండ్ కో టీమ్.. ఇప్పటివరకు షూట్ సీన్స్ ఔట్ పుట్ ను పరిశీలించారట.
కొన్ని సన్నివేశాలపై దిల్ రాజు అసంతృప్తిగా ఉన్నాడని… దీంతో ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సీన్స్‌ను తిరిగి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా అవుట్ పుల్ లో ఏమాత్రం తగ్గేదే లేదు అంటున్నారు దిల్ రాజు. ఈ చిత్రంలో చైతూ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారని … అందుకు తగినట్లుగానే తన లుక్ ను మార్చుకున్నాడని సినివర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Thank you movie makers planning to re shoot some scenes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com