Homeఎంటర్టైన్మెంట్Pelli SandaD Heroine: Sree Leela Biography, Age, Photos, Movies, Dob, Family,...

Pelli SandaD Heroine: Sree Leela Biography, Age, Photos, Movies, Dob, Family, Instagram Details

Pelli SandaD Heroine SREE LEELA Biography:  ‘అందం.. అమ్మాయి అయితే.. నీలా ఉందే.. అన్నట్టుందే..’ అని ఏ కవి రాశాడో కానీ.. ఇప్పుడు ‘పెళ్లి సందD’ మూవీ హీరోయిన్ ను చూస్తే యువత గుండెలు లాగేయడం ఖాయం. అంతగా అందం, చందం ఉన్న ఈ ముద్దుగుమ్మను ఆ రాఘవేంద్రుడు ఎక్కడో పట్టాడో కానీ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. ఆమెతో సినిమాలో చేయించిన రోమాన్స్.. Pelli Sandad Heroine age  ఆమె నాభిపై విసిరిన పండ్లు, పూలు చూసి అభిమానులకు పిచ్చెక్కిపోతోందట.. మరి ఇంత అందాన్ని దాచుకున్న కొత్త హీరోయిన్ ‘శ్రీలీల’ ఎవరు? ఎక్కడి వారు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందామా?

pelli sandaD heroine sri leela
pelli sandaD heroine sri leela

ఒకప్పుడు టాలీవుడ్ కు ముంబై, ఢిల్లీ ఉత్తారాది నుంచి హీరోయిన్లు సరఫరా అయ్యే వారు. వారికి తెలుగు రాక.. నేర్పించలేక మన దర్శకులు తెగ ఆపసోపాలు పడేవారు. కానీ ఇప్పుడు మన తెలుగుకు దగ్గరగా ఉండే దక్షిణాది నుంచి హీరోయిన్లు వచ్చిపడుతున్నారు. ముఖ్యంగా కేరళ, కన్నడ, తమిళ్ నుంచి తెలుగులోకి హీరోయిన్లు వస్తూ సత్తా చాటుతున్నారు. చూడచక్కని తెలుగులో మాట్లాడి అలరిస్తున్నారు.

ఇప్పటికే రష్మిక మందానా, పూజా హెగ్డే వంటి కన్నడ కుట్టిలు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. ఇప్పుడు అదే కర్ణాటకకు చెందిన కొత్త అందం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆమె తాజాగా రిలీజ్ అయిన ‘పెళ్లి సందD’ హీరోయిన్ ‘శ్రీలీల’. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్​ కుమారుడు రోషన్​ హీరోగా రూపొందిన ‘పెళ్లిసందడి’లో హీరోయిన్ గా శ్రీలల నటించింది. అందాల రాశిని ఏరికోరి సెలెక్ట్ చేసి రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశాడు.పెళ్లి సందడిలో శ్రీలీల నటన చూశాక తెలుగు సినిమాకు మరో టాప్ హీరోయిన్ దొరికిందనిపించేలా ఉంది. ఈమె బయోగ్రఫీ తెలుసుకుందాం..

Pelli SandaD Heroine: Biography, Age, Native Place, EducationDetails

శ్రీలీల ప్రవాస భారతీయురాలు. అమెరికాలోని మిచిగాన్ లో గల డెట్రాయిట్ లో 2001, జూలై 14న జన్మించింది. ఈమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెలుగులోకి వచ్చింది.. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. తల్లిదండ్రులు అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. శ్రీలీల సంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించింది. ఈమెకు శ్రీకర్, శ్రీదీప్ అనే ఇద్దరు సోదరులున్నారు. ఈమె తల్లి డాక్టర్ స్వర్ణలత.. తండ్రి పేరు సుధాకర్ రావు సురపనేని.. ఈయన వ్యాపారవేత్త. శ్రీలీల తల్లి డాక్టర్ అయినందున.. ఈమె కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని తపనపడింది. చదువులో ఎప్పుడూ ముందుడేది. తెలుగు కూడా శ్రీలలకు వచ్చింది. ఈమె మంచి డ్యాన్సర్ కూడా.. 8 ఏళ్ల వయసు నుంచే క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుంది. ఈమెకు నటన ఇష్టం కావడంతో సినిమాల్లో నటిస్తూనే   మెడిసిన్ చదివింది. కాలేజీలో ఉండగా అన్నింట్లో ఉత్సాహంగా ఉన్న శ్రీలీలను స్నేహితులు మోడలింగ్ చేయమని ప్రోత్సహించడంతో ఆమె సినిమాల్లోకి వచ్చేసింది. 2019 సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ‘కిస్’ సినిమాతో కన్నడలో శ్రీలీల మెరిసింది. శ్రీలీలకు కన్నడలో ‘రాధిక పండిట్’; హీరో యష్ తో సన్నిహిత సంబంధాలున్నాయి.

srileela2
srileela2

-శ్రీలీల ఇష్టాయిష్టాలు
శ్రీలీలకు చాక్లెట్స్, మసాలా దోశ, బిర్యానీలంటే చాలా ఇష్టం. ఆమె కాలేజీలో ఉండగా వీటినే తెగ తినేవారట.. హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీని ఇష్టంగా తింటారట.. ఇక ఫిజిక్ మెయింటేన్ చేయడం కోసం ఎక్సర్ సైజులు చేయకుండా ఒక గంట పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందట.. అందుకే ఎప్పుడూ ఫిట్ గా.. హ్యాపీగా ఉంటుందట.. స్పోర్ట్స్ అంటే ఇష్టపడే శ్రీలీల చదువుకుంటున్న వేళ కర్ణాటక స్టేట్ స్విమ్మర్ గా కూడా రాణించింది. శ్రీలీలకు పింక్ కలర్ లిప్ స్టిక్ కావాలని తరచూ అడిగేదట.. ఇద్దరు అన్నయ్యల  తర్వాత పుట్టడంతో శ్రీలీలకు ఫస్ట్ లవ్, క్రష్ లాంటివి లేకుండా పోయాయని.. ఇద్దరూ బాడీగార్డ్ లుగా ఉండేవారని.. అందుకే ప్రేమికులు ఎవరైనా ప్రపోజ్ చేయడానికి భయపడేవారని శ్రీలీల చెప్పుకొచ్చింది.

Pelli SandaD Heroine Sree Leela Biography, Wiki Details

శ్రీలీల సినీ పరిశ్రమకు కొత్తేం కాదు. Pelli SandaD Heroine Images  గతంలో కన్నడలో కిస్​, భరాటి వంటి కన్నడ చిత్రాల్లో నటించి అందం, అభినయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘కిస్ ’ సినిమాలో ఈమె అందానికి, నైపుణ్యానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఈమె వైపు తిరిగింది. సంప్రదాయం, గ్లామర్​ ఏ లుక్​ లో చూసినా తన అందంతో కుర్రకారును కవ్వించింది.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. ఆమె డాక్టర్ కావాలనే తలంపుతో మెడికల్ డిగ్రీ కూడా చదివింది. ఇక తెలుగులో అవకాశాలు వచ్చినా వెయిట్ చేసిన శ్రీలీల రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడు, పెద్ద బ్యానర్ నుంచి సినీ అవకాశం రావడంతో ఒప్పేసుకుంది. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లను లాంచ్ చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే పర్ ఫెక్ట్ లాంచ్ అని శ్రీలీల భావించి ఈ సినిమాలో నటించింది.

Pelli SandaD Heroine Sree Leela Movies

పెళ్లిసందడి మూవీలో శ్రీలీలను చూసిన జనాలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మాయి కోసమైనా సినిమా చూడాలని యూత్ క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కన్నడలో ‘బై టు లవ్’, ‘జుబారియా’ అనే సినిమాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈమె సినిమాల్లన్నీ మంచి విజయాలు సాధించాలని..తెలుగులో మరో ‘శ్రీదేవి’ అంత ఎత్తుకు ఎదగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్ శ్రీదేవి.

Pelli SandaD Heroine Sree Leela
Pelli SandaD Heroine Sree Leela

 

Pelli SandaD Sree Leela Movie Images
Pelli SandaD Heroine Sree Leela

 

Pelli SandaD Heroine Sree Leela
Pelli SandaD Heroine Sree Leela

Pelli SandaD Heroine Sree Leela Details

Name Sree Leela
Profession Actress
Date of Birth 14-07-2001
Birth Place Detroit, USA
Age 20
Native Place Bangalore, Karnataka
Religion Hindu
Height 5’6″
School N/A
College N/A
Education Details N/A
Sree Leela Movies Kiss (Kannada)
Pelli SandaD (Telugu)
Nationality Indian
Parents Father Name: Sudhakar Rao
Mother Name: Swarna Latha
Sibling(s) Sreekar
Sreedeep

 

Also Read: Actress Surekha Biography, age, Movies, Movies

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular