Homeఎంటర్టైన్మెంట్Sharwanand new movie update: టైమ్ ట్రావెల్ కామెడీ ఎంటర్టైనర్ గా శర్వానంద్ కొత్త చిత్రం.....

Sharwanand new movie update: టైమ్ ట్రావెల్ కామెడీ ఎంటర్టైనర్ గా శర్వానంద్ కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..

Sharwanand new movie update: యంగ్ హీరో శర్వానంద్ వరుస ఫ్లాప్ స్ట్రీక్ నుండి బయట పడ్డాడు అనే అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఆయన నుండి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన నుండి విడుదలైన ‘బైకర్’ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, మంచి కంటెంట్ సినిమా అని మాత్రం అనిపించుకుంది. రీసెంట్ గానే నెట్ […]

Sharwanand new movie update: యంగ్ హీరో శర్వానంద్ వరుస ఫ్లాప్ స్ట్రీక్ నుండి బయట పడ్డాడు అనే అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఆయన నుండి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన నుండి విడుదలైన ‘బైకర్’ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, మంచి కంటెంట్ సినిమా అని మాత్రం అనిపించుకుంది. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది, శర్వానంద్ ప్రస్తుతం సరైన ట్రాక్ లోనే వెళ్తున్నాడు అనేది. అయితే శర్వానంద్ రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తో కలిసి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇప్పుడిప్పుడే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి శర్వానంద్ వస్తున్నాడు అనుకుంటే , ఇదేమి ట్విస్ట్. వరుస ఫ్లాప్స్ తో ఆడియన్స్ లో పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన శ్రీను వైట్ల తో ఎందుకు సినిమా చేస్తున్నాడు? , మళ్లీ శర్వానంద్ ట్రాక్ తప్పుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న తర్వాత , శర్వానంద్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని అనిపిస్తోంది. ఈ చిత్రం సాధారణమైన రొటీన్ కామెడీ జానర్ కి సంబంధించినది కాదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అట. టైం ట్రావెల్ జానర్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి , కానీ కామెడీ ఎంటర్టైనర్ మాత్రం రాలేదు. నేటి తరం ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా, వేరే లెవెల్ లో ఈ స్క్రిప్ట్ ని రెడీ చేసాడట శ్రీను వైట్ల. ఈ చిత్రం తో తన కం బ్యాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండాలని డిజైన్ చేశాడట.

ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా పూజ హెగ్డే ని తీసుకుందామని అనుకున్నారు కానీ , ప్రస్తుతం ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడం తో మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి ని ఎంచుకున్నారట. రీసెంట్ గానే ఈమె ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే భారీ యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ తో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కెరీర్ మంచి ఊపు మీదున్న సమయం లో ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకుంది. ఇది కూడా ఒక విధంగా ఈ చిత్రానికి పాజిటివ్ వైబ్స్ ని కలిగించే విషయం అనే చెప్పొచ్చు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టి , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper