Homeఎంటర్టైన్మెంట్Venkatesh rejected 500 crore movie: 500 కోట్ల సినిమాని రిజెక్ట్ చేసిన విక్టరీ వెంకటేష్.....

Venkatesh rejected 500 crore movie: 500 కోట్ల సినిమాని రిజెక్ట్ చేసిన విక్టరీ వెంకటేష్.. ఇది మామూలు దురదృష్టం కాదు..

Venkatesh rejected 500 crore movie: కొన్ని చిత్రాలను వదులుకున్నప్పుడు, అవి కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా హిట్ అయ్యినప్పుడు , అయ్యో మా హీరో బంగారం లాంటి సినిమాని మిస్ చేసుకున్నాడే అని బాధ పడుతుంటాము , ఇలాంటి సందర్భాలు దాదాపుగా ఇండియా లో ప్రతీ హీరో అభిమానికి కూడా వచ్చే ఉంటుంది. రీసెంట్ గా అలాంటి సందర్భం విక్టరీ వెంకటేష్ కి కూడా వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఆయన […]

Venkatesh rejected 500 crore movie: కొన్ని చిత్రాలను వదులుకున్నప్పుడు, అవి కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా హిట్ అయ్యినప్పుడు , అయ్యో మా హీరో బంగారం లాంటి సినిమాని మిస్ చేసుకున్నాడే అని బాధ పడుతుంటాము , ఇలాంటి సందర్భాలు దాదాపుగా ఇండియా లో ప్రతీ హీరో అభిమానికి కూడా వచ్చే ఉంటుంది. రీసెంట్ గా అలాంటి సందర్భం విక్టరీ వెంకటేష్ కి కూడా వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఆయన కెరీర్ లో మైలు రాయి లాగా నిల్చిపోయిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం’. మిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా , మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్. అక్కడ మోహన్ లాల్ హీరో గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాని తెలుగు లో వెంకటేష్ తో , తమిళం లో కమల్ హాసన్ తో , హిందీ లో అజయ్ దేవగన్ తో తెరకెక్కించారు.

ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. తెలుగు , మలయాళం భాషల్లో సీక్వెల్స్ కరోనా లాక్ డౌన్ సమయం లో రెడీ అయ్యాయి. అప్పటికి థియేటర్స్ అన్నీ క్లోజ్ ఉండడం తో ఈ రెండు చిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియో లో నేరుగా విడుదల చేశారు. రెండిటికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది . కానీ హిందీ లో అజయ్ దేవగన్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అప్పుడు తెలుగు , మలయాళం ఒరిజినల్ మేకర్స్ , అయ్యో అనవసరంగా థియేటర్స్ లో విడుదల చేయకుండా పెద్ద పొరపాటు చేశామే అని బాధ పడ్డారు . అయితే రీసెంట్ గానే మలయాళం లో మోహన్ లాల్ ‘దృశ్యం 3’ చిత్రాన్ని పూర్తి చేసాడు.

ఈ నెల 21 న మలయాళం , తమిళం, తెలుగు , కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో 21 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అతి తక్కువ షోస్ నుండి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందంటే , పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రానికి నమోదు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే కచ్చితంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసేలా అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మలయాళం లోనే ఆ రేంజ్ వసూళ్లు వస్తే , తెలుగు లో వెంకటేష్ కి ఉన్నటువంటి ప్రస్తుత పీక్ మార్కెట్ లో 500 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఉండేదని , మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper