Naveen – Naresh : ప్రేమకి వయస్సుతో సంబంధం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కొంతమంది అంటుంటారు.కానీ ఆ ప్రేమ ఒక్క అమ్మాయితో ఆగకుండా, నాలుగు సార్లు పుట్టిందంటే అది ప్రేమ అనుకోవాలో, లేదా వ్యామోహం అనుకోవాలో అర్థం కావడం లేదని నరేష్ – పవిత్ర జంటని చూసిన నెటిజెన్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు.
పెళ్ళికి ఎదిగిన పిల్లలను ఇంట్లో పెట్టుకొని నరేష్ వేస్తున్న ఈ వెక్కిలి చేష్టలు చూసి, అసలు ఇతను ఏమి మనిషి రా బాబు అని తిట్టుకుంటున్నారు. ఒకటి కాకపోతే 10 పెళ్లిళ్లు చేసుకోవచ్చు, అది ఆయన వ్యక్తిగతం, కానీ ఎదో ఘనకార్యం చేసినట్టు , వీళ్ళ ప్రేమకథ గురించి 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తియ్యడం నరేష్ పైత్యానికి పరాకాష్ట లాంటిది అని అంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే విడుదలైంది.
త్వరలోనే సినిమా థియేటర్స్ లో కూడా రానుంది, అయితే నరేష్ చేస్తున్న చేష్టలను చూసి ఆయన కుమారుడు నవీన్ చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నాడని తెలుస్తుంది. నాల్గవ పెళ్లి చేసుకోవడమే కాకుండా , దానిని మళ్లీ సినిమాగా తీసి కుటుంబం పరువు మొత్తం తీస్తున్నాడని, నలుగురిలో నరేష్ కొడుకు అని చెప్పుకొని తిరగడానికి సిగ్గు పడే పరిస్థితి తెచ్చాడని నవీన్ తన సన్నిహితులతో తన బాధని చెప్పుకొని ఏడ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.
నవీన్ 8 ఏళ్ళ క్రితం ఇండస్ట్రీ కి ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే చిత్రం ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు కూడా వచ్చాడు, కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆయన హీరో గా నాలుగు సినిమాల్లో నటించాడు కానీ ఒక్క సక్సెస్ కూడా రాలేదు. దాంతో ఆయన సినిమాలు ఆపేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Sensational comments by son naveen on father vk naresh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com