Actor Naresh Hey Bhagavan Movie: సీనియర్ నటుడు నరేష్(Actor Naresh) కి టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంత మంచి డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏడాదికి 20 సినిమాలు తక్కువ కాకుండా చేసే ఆయన, ఈమధ్య కాలం లో సినిమాల సంఖ్య బాగా తగ్గించాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’,’గేమ్ చేంజర్’ వంటి చిత్రాల్లో మాత్రమే కనిపించాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ పవిత్ర తో వివాహం చేసుకున్న తర్వాత ఆయన కెరీర్ లో ఊపు తగ్గింది అనేది మాత్రం వాస్తవం. ఇది ఇలా ఉండగా కొంత గ్యాప్ తర్వాత ఆయన సుహాస్(suhas) హీరో గా నటించిన ‘హే భగవాన్'(Hey Bhagavan) అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం లో ఆయన కీలక పాత్ర పోషించాడు. న్మేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నరేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: జగపతి బాబు దెబ్బకు షో నుండి పారిపోయిన హీరోయిన్ శ్రీలీల..వీడియో వైరల్!
ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లో ఇప్పటి వరకు డేట్స్ విషయం లో నిర్మాతల నుండి ఎలాంటి కంప్లైంట్ రాలేదు. ఈమధ్య కాలం లో నటుడిగా నాకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టిన ‘సామజవరగమన’ కథ విన్న కొత్తల్లో డైరెక్టర్ కి డేట్స్ లేవు, చేయలేనని చెప్పాను. పాపం ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర నా డేట్స్ కోసం నెల రోజులు ఎదురు చూశాడు. ఆ చిత్రం నాకు మిగిల్చిన అనుభూతి జీవితం లో మర్చిపోలేను. అలాంటి కథలు చాలానే విన్నాను. కొన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వాలంటేనే భయం వేసేది. ఎందుకంటే తీరా ఆ సినిమా షూటింగ్ సమయం లో నా డేట్స్ ఎక్కడ అందుబాటులో ఉండవో అని భయపడేవాడిని. ఈ ‘హే భగవాన్’ సినిమా విషయంలో అదే జరిగింది. కానీ ఎట్టి పరిస్థితి లోనూ ఈ సినిమా మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకే అంగీకరించి ఈ చిత్రాన్ని చేసాను. నా డేట్స్ కోసం షూటింగ్ తేదీల్లో దర్శక నిర్మాతలు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందుకు నేను వాళ్ళకు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను ఏది మాట్లాడిన ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతాను, ఈ విషయం అందరికీ తెలిసిందే, ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది, టైటిల్ తోనే అందరిలోనూ ఆసక్తి కలిగించేలా చేశారు. ఈ సినిమా తర్వాత సుహాస్ ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లో ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్, కొత్త రచయితలే రాజ్యం ఏలుతున్నారు. సరికొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తున్నారు. ఒకప్పుడు నేను మలయాళం, తమిళం లో వచ్చే సినిమాలను చూసి ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో ఎందుకు రావు అనుకునేవాడిని. ఇప్పుడు ఆ లోటు కనిపించడం లేదు. ఇది కంటెంట్ రాజ్యం ఏలుతున్న కాలం. సుహాస్ ఇంత తక్కువ సమయం లో ఈ స్థాయికి రావడం నిజంగా గర్వకారణం’ అంటూ ఆయన ప్రసంగించాడు.