spot_img
Homeఎంటర్టైన్మెంట్Naresh- Pavitra Lokesh: రహస్య వివాహం నిజమే? మహాబలేశ్వర్ లో నరేష్, పవిత్ర లోకేష్!

Naresh- Pavitra Lokesh: రహస్య వివాహం నిజమే? మహాబలేశ్వర్ లో నరేష్, పవిత్ర లోకేష్!

Naresh- Pavitra Lokesh: నటి పవిత్ర లోకేష్ తో నరేష్ వివాహం అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా ఉంది. నరేష్ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. అయితే వీరిద్దరూ ఇప్పటికే రహస్య వివాహం చేసుకున్నారనేది తాజా వార్త. పవిత్ర లోకేష్ మొదటి భర్తతో విడిపోయారు. ఆమెకు అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. అందుకే కేవలం సన్నిహితుల సమక్షంలో రహస్యంగా వీరి వివాహం జరిగిందట. ఈ వార్తలకు బలం చేకూర్చేలా నరేష్, పవిత్ర లోకేష్ పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు.

Naresh- Pavitra Lokesh
Naresh- Pavitra Lokesh

సడన్ గా ఈ జంట మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ టెంపుల్ ని సందర్శించిన నరేష్, పవిత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరి మహాబలేశ్వర్ విజిట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక చాలా కాలంగా వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లు సమాచారం. తెలుగులో పవిత్ర బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి కూడా నరేషే కారణం అనే టాక్ ఉంది.

Also Read: Mahesh -Trivikram Movie Cancelled: మహేష్ – త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్..?? కారణం అదేనా?

ఇక పవిత్ర లోకేష్ నేపథ్యం చూస్తే ఆమె కన్నడ అమ్మాయి. 1995లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా, సైడ్ హీరోయిన్ రోల్స్ చేశారు. తెలుగులో పవిత్ర లోకేష్ ఫస్ట్ మూవీ దొంగోడు. రవితేజ హీరోగా 2003లో విడుదలైన ఈ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్ర చేశారు. 2010 నుండి పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన అంటే సుందరానికీ, సర్కారు వారి పాట, రెడ్, డియర్ మేఘ, అర్ధ శతాబ్దం వంటి చిత్రాలు విడుదలయ్యాయి.

Naresh- Pavitra Lokesh
Naresh- Pavitra Lokesh

ఇక నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . స్టార్ లేడీ విజయనిర్మల మొదటి భర్త కొడుకే నరేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నరేష్… 80-90 లలో హీరోగా కొనసాగారు. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక కొంచెం గ్యాప్ తీసుకున్న నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన సూపర్ సక్సెస్ జర్నీ కొనసాగిస్తున్నారు.

Also Read:Highest Grossing Film After RRR: ఈ ఏడాది RRR తర్వాత భారీ వసూళ్లు సాధించిన సినిమా ఏమిటో తెలుసా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper