Highest Grossing Film After RRR: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చాలా కాలం తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి..కరోనా కారణం గా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమకి గత డిసెంబర్ నెల నుండి ఇప్పటి వరుకు విడుదలైన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా విజయం సాధించిన సినిమాలే ఎక్కువ..లాక్ డౌన్ సమయం లో OTT కి అలవాటు పడిన జనాలు మళ్ళీ థియేటర్స్ కి వచ్చి చూసేంత సీన్ ఉందా అని భయపడుతున్న ట్రేడ్ వర్గాలన్నీ ఇప్పుడు ఒప్పిరి పీల్చుకున్నాయి..ఇక ఈ ఏడాది మన టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా #RRR అనే విషయం మన అందరికి తెలిసిందే..రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్నీ బాషలలో అద్భుతమైన వసూళ్లను సాధించి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది..ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా దాదాపుగా 270 కోట్ల రూపాయిల వరుకు షేర్ ని వసూలు చేసింది..ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ కి కలిపి దాదాపుగా 400 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా..అయితే #RRR సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

Charan, Tarak
Also Read: Ante Sundaraniki OTT Release Date: నాని అంటే సుందరానికీ ఓటీటీలో… అధికారిక డేట్ ఇదే!
#RRR కి ముందు ఫిబ్రవరి 25 వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది..పవర్ స్టార్ సినిమాకి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మన అందరికి తెలిసిందే..మొదటి వారం మొత్తం కూడా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ ముక్క కూడా దొరకలేదు..అద్భుతమైన కలెక్షన్స్ ని రాబట్టింది..కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా కి టికెట్ రేట్స్ లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది అనే చెప్పాలి..ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కి అధికార పార్టీ కి మధ్య ఉన్న విభేదాల గురించి మన అందరికి తెలిసిందే..ఆ రాజకీయ పరిణామాల కారణంగానే భీమ్లా నాయక్ సినిమా ని ఇక్కడి ప్రభుత్వం దారుణంగా తొక్కేసింది అనే చెప్పాలి..కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాల్సిన ఈ సినిమా ఫుల్ రన్ లో 103 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టగలిగింది..ఇక ఈ సినిమా తర్వాతి స్థానం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా నిలిచింది..ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి టికెట్ రేట్స్ దక్కాయి..కానీ యావరేజి టాక్ రావడం తో ఈ సినిమా కేవలం 97 నుండి వంద కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..ఈ రెండు సినిమాలు కాకుండా KGF చిత్రం ప్రస్తుతం #RRR తర్వాత టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది..భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న KGF చాప్టర్ 2 సినిమా కేవలం తెలుగులోనే 110 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట..అలా ఈ ఏడాది నాన్ #RRR హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా KGF చాప్టర్ 2 నిలిచింది.

KGF Chapter 2
Also Read: Minister KTR Tours: కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నది అందుకేనా?