Mahesh -Trivikram Movie Cancelled: ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న స్టార్ హీరో ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకువచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు..స్పైడర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇప్పటి వరుకు కమర్షియల్ గా సక్సెస్ అవుతూనే వచ్చాయి..ఇక రీసెంట్ గా విడుదలైన సర్కారు వారి పాట సినిమా కూడా కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లనే రాబట్టింది..ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..అతడు , ఖలేజా వంటి క్లాసిక్ సినిమాల తర్వాత దాదాపుగా 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ఇది..దాంతో ఈ సినిమా పై షూటింగ్ ప్రారంభం కాకముందు నుండే అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి..ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటి వరుకు ప్రారంభం కాలేదు..రెగ్యులర్ షూటింగ్ ఇప్పటి వరుకు ప్రారంభం కాకపొయ్యేసరికి ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త నిన్నటి నుండి తెగ హల్చల్ చేస్తుంది.

Also Read: Highest Grossing Film After RRR: ఈ ఏడాది RRR తర్వాత భారీ వసూళ్లు సాధించిన సినిమా ఏమిటో తెలుసా?
అదేమిటి అంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని ఫిలింనగర్ లో ఒక్క వార్త తెగ చక్కర్లు కొడుతోంది..మహేష్ అభిమానులు ఈ కాంబినేషన్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు..ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వబోతుంది అనే వార్త అభిమానుల్లో గుబులు రేపుతోంది..అసలు విషయానికి వస్తే తొలుత ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పగానే మహేష్ బాబు కి తెగ నచ్చేసింది..వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అని త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు..అయితే ఇటీవలే స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ జర్మనీ టూర్ లో ఉన్న మహేష్ బాబు ని కలిసి వినిపించాడట..ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత మహేష్ బాబు ఎందుకో సంతృప్తి గా లేనట్టు తెలుస్తుంది..కథలో కీలకమైన మార్పులు చేసి మళ్ళీ తీసుకొని రమ్మని త్రివిక్రమ్ కి చెప్పాడట మహేష్ బాబు..ప్రస్తుతం ఆయన ఈ స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేసే పనిలో బిజీ గా ఉన్నాడు..ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ సరిగ్గా ఉంటేనే రెగ్యులర్ షూటింగ్ పెట్టుకుందాం అని..లేకపోతే ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి ఆపేద్దాం అని త్రివిక్రమ్ కి మొహం మీదనే చెప్పడట మహేష్..ఎందుకంటే ఇటీవలే ఆయన నటించిన సర్కారు వారి పాట సినిమా పై మహేష్ సంతృప్తి గా లేదట..ఆయనకీ చెప్పిన స్టోరీ లైన్ ఒకటి అయితే..తీసిన ఔట్పుట్ వేరేలా వచ్చిందట..అందుకే మహేష్ మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనందువల్లే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది..మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read: Ameesha Patel: పవన్ హీరోయిన్ పెళ్లికి దూరమైంది అందుకే.. ఆ ఇద్దరితో ఎఫైర్, బ్రేకప్ వల్లేనా?
[…] […]