Homeఎంటర్టైన్మెంట్Sankranthiki Vasthunnam: 'సంక్రాంతికి వస్తున్నాం' మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..'పుష్ప 2' కి ఇలాంటి వసూళ్లు...

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..’పుష్ప 2′ కి ఇలాంటి వసూళ్లు చూడలేదుగా..వెంకీ మామ మాస్ ర్యాంపేజ్!

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడితే ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి. సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరూ సాధించలేని రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. అనేక ప్రాంతాల్లో ఈ చిత్రం #RRR, పుష్ప2 రికార్డ్స్ ని కూడా కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లోని విజయనగరం వంటి సెంటర్ లో ఈ చిత్రానికి మొదటి వారం ఏకంగా రెండు కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. #RRR చిత్రానికి ఇక్కడ మొదటి వారం 2 కోట్ల 17 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే ఈ ప్రాంతం లో #RRR చిత్రం కంటే ఈ సినిమాకే భారీ మార్జిన్ లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడితే ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి. సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రం విడుదలై వారం రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 7వ రోజు తెలుగు రాష్ట్రాల నుండి 6.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 7 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 89 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు 144 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 5 కోట్ల 70 లక్షలు, ఓవర్సీస్ నుండి 12 కోట్ల రూపాయిలు, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 107 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు 184 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.

సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రం ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ ప్రాంతం నుండి 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా నైజాం లో 40 కోట్లు, ఉత్తరాంధ్ర లో 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రం 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గ్రాస్ 300 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. కేవలం పాన్ ఇండియన్ హీరోలకు మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వెంకటేష్ కూడా చేరిపోయాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper