Venkatesh Trivikram Srinivas Movie : టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలను ఎన్ని వందల సార్లు చూసినా బోరు కొట్టదు. ఈ రెండు చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అయితే ఇద్దరి కమిట్మెంట్స్ లో ఎవరికీ వారు ఫుల్ బిజీ గా ఉండడం వల్ల వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా ఇప్పటి వరకు రాలేదు. ‘అజ్ఞాతవాసి’ మూవీ సమయం లో త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా ఖరారు అయ్యింది. కానీ అది కార్యరూపం దాల్చింది మాత్రం రీసెంట్ గానే. ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత త్రివిక్రమ్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత వెంకటేష్ కలయిక లో రాబోతున్న సినిమా ఇది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త వెరైటీ టైటిల్ ని పెట్టాడు. ఆయన సినిమాల టైటిల్స్ ని మొదటి నుండి పరిశీలించి చూస్తే, చాలా కొత్తగా అనిపిస్తాయి. మొదట్లో ఇదేమి టైటిల్ రా బాబు అనిపిస్తుంది కానీ, అలవాటు అయినప్పుడు మాత్రం సూపర్ టైటిల్ గా అనిపిస్తాది. ఇప్పుడు వెంకటేష్ తో చేయబోతున్న సినిమాకు ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టైటిల్ ని చూస్తేనే అర్థం అవుతుంది కదా, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. కచ్చితంగా ఈ సినిమాని వచ్చే ఏడాది దసరా కి, లేదా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే వెంకటేష్ కెరీర్ లో మరో ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ హిట్ ని చూడొచ్చు. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించబోతోంది. ఈ విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇందులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్. కేవలం చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో పార్టీ సాంగ్ చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట. ఇది పూర్తి అయ్యాక వెంకటేష్ పార్ట్ షూటింగ్ ముగిసినట్టే. త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రాన్ని డిసెంబర్ 14 నుండి మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రయికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా రానుంది.