Mana Shankara Varaprasad Trailer : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొత్త చరిత్రను రాసిన నటుడు చిరంజీవి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిలిపాయి. 70 సంవత్సరాల వయసులో సైతం ఆయన ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను కనక మనం చూసినట్లయితే ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికి అనిల్ రావిపూడి గత సంవత్సరం చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని పాయింట్స్ కొన్నింటిని ఈ సినిమాలో కలిపి తీసినట్టుగా అనిపించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ కామెడీ చాలా హైలైట్ అయింది.
అదే ఫ్లేవర్ లో చిరంజీవితో సినిమా చేస్తే అది వర్కౌట్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి కామెడీ టైమింగ్ కి వెంకటేష్ కామెడీ టైమింగ్ కి చాలా తేడా ఉంటుంది. వెంకటేష్ ఫ్యామిలీతో చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ చిరంజీవి ఫ్యామిలీతో చేసే కామెడీ అంతా ఎఫెక్టివ్ గా ఉండదు. ట్రైలర్లో సైతం చిరంజీవి చేసిన కామెడీ తేలిపోయిందనే చెప్పాలి…
మరి వెంకటేష్ మీద సక్సెస్ అయిన కాన్సెప్ట్ చిరంజీవితో వర్కౌట్ అవ్వదు. ఫ్యామిలీ కామెడీని కాకుండా డిఫరెంట్ కామెడీని ట్రై చేస్తే బాగుండేది. ట్రైలర్ చూస్తున్నంత సేపు చిరంజీవి క్యారెక్టర్ ఓకే అనిపించినప్పటికి కామెడీ టైమింగ్ మాత్రం అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. ఇక చివరిలో వెంకటేష్ వచ్చిన తర్వాత ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకునే డైలాగులు బాగున్నాయి.
అంతే తప్ప చిరంజీవి వైఫ్ కి భయపడుతూ చేసే కామెడీ భార్య ముందు తగ్గినట్టుగా ఉండే సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా లేవు…చిరంజీవిని తన అభిమానులు అలా చూడలేరు. థియేటర్లో సైతం వీటి మీద కొన్ని విమర్శలు వచ్చే అవకాశామైతే ఉంది. మరి ఎందుకని అనిల్ చిరంజీవి మీద ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడు అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది…