Mana Shankara Varaprasad Trailer Review : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ట్రైలర్ కి మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ యూత్ ఆడియన్స్ నుండి మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. ప్రతీ అనిల్ రావిపూడి మూవీ కి జరిగేదే ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ కి కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. కానీ దాని ఫలితం ఏంటో మనమంతా చూసాము. ‘మన శంకర వత్ప్రసాద్ గారు’ కి కూడా అదే రిపీట్ అవ్వొచ్చేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే, అసలు ఈ ట్రైలర్ లో ఉన్న ప్లస్సులు ఏంటి, మైనస్సులు ఏంటి అనేది ఒకసారి వివరంగా చూద్దాం.
ప్లస్సులు :
* వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్. ఆయన్ని ఇలాంటి యాంగిల్ లో చూసి అభిమానులు చాలా కాలమే అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారిగా అన్నయ్య చిత్రం లోని చిరంజీవి ని గుర్తు చేసుకున్నారు. ఆ రేంజ్ కామెడీ టైమింగ్ ని మరోసారి మెగాస్టార్ నుండి బయటకు తీసుకొచ్చినట్టు ఉన్నాడు అనిల్ రావిపూడి.
* ఈ ట్రైలర్ లోని మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విక్టరీ వెంకటేష్ ఎంట్రీ. ట్రైలర్ చివర్లో ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి అని చిరంజీవి అనడం, మాస్ కా బాప్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ వైపు రాలేదా అని వెంకటేష్ కౌంటర్ ఇవ్వడం, చూసేందుకు చాలా బాగా అనిపించింది. వెండితెర పై వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంది.
* ఈ ట్రైలర్ లో కనిపించిన చివరి ప్లస్ పాయింట్ చిరంజీవి, నయనతార కాంబినేషన్. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది , నిజమైన భార్య భర్తలు లాగానే అనిపిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి నయనతార ని చిరంజీవి కి జోడీగా ఎంపిక చేసినప్పుడే డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అనొచ్చు.
మైనస్సులు:
* చిరంజీవి లుక్స్ ఎందుకో పేలవంగా ఉన్నాయి. మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ మీద కనపడితే, ఒక నిండుతనం ఉట్టిపడేది. అది ఈ ట్రైలర్ లో చూస్తుంటే కనిపించడం లేదు. బాగా తగ్గడమే చిరంజీవి కి మైనస్ అయ్యిందని చెప్పొచ్చు.
* ఈ ట్రైలర్ లో బాగా మైనస్ అనిపించిన అంశం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అసలు గుర్తుపెట్టుకునేలా లేదు. రౌడీ అల్లుడు మూవీ థీమ్ మ్యూజిక్ ని తిప్పి కొట్టినట్టుగా అనిపించింది. ఒక సినిమాని పైకి నిలబెట్టేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అదే మైనస్ అయితే సినిమా సగం ఫ్లాప్ అయినట్టు. ట్రైలర్ లో అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తేలిపోయింది. మూవీ లో అయినా బాగుంటుందో లేదో చూడాలి.
* ఇక ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత మనకు డాడీ, తులసీ, విశ్వాసం లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. వాటిల్లో కూడా ఇంతే, భార్య భర్తలు విడిపోతారు, కూతురు/ కొడుకు కోసం తండ్రి పరితపిస్తూ ఉంటాడు. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అదే లాగా అనిపిస్తుంది.