Samantha Ruth Prabhu Second Marriage: పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). కేవలం ఈమె పేరు చూసి థియేటర్స్ కి కదిలే జనాలు లక్షల్లో ఉంటారు. అందుకే ఈమెని పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ‘ఏ మాయ చేశావే ‘ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన సమంత , ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక , ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుండి అన్ని భాషల్లోనూ దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి సమంత సినిమాలు చేసింది . కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలోనే హీరో నాగ చైతన్య ని ప్రేమించి 2017 వ సంవత్సరం లో పెళ్లి చేసుకుంది.
కొన్నాళ్ల వరకు వీళ్ళ దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కానీ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ , వీళ్లిద్దరు 2021 వ సంవత్సరం లో విడిపోయారు. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని వివాహం చేసుకోగా , సమంత గత ఏడాది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు ని పెళ్లి చేసుకుంది. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియా లో సమంత మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత , మళ్లీ రెండవ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన రాలేదు. నా జీవితం లో ఇక ఎవ్వరినీ నమ్మకూడదు అని అనుకున్నాను. కానీ అలాంటి సమయంలోనే రాజ్ నాకు పరిచయం అయ్యాడు ‘.
‘తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న నేను , అతను నా జీవితం లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మారిపోయాను. నా స్నేహితులు కూడా ఈమధ్య కాలం లో నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. సమంత ఇంతలా ఎలా మారిపోయింది అని ‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కాలం గడిచే కొద్దీ ప్రేమగా మారింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వం లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో నటిస్తుంది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.