సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya) జోడి పరిశ్రమలో అందరిని ఆకర్షించింది. కానీ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి మరింత వివాదం పెంచారు. నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన జంట అప్పుడే విడిపోవడం ఏమిటని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బంగారం లాంటి కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఓ వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత, చైతుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

సమంత, చైతన్య విడాకులపై మరికొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కినేనిది పెద్ద కుటుంబం కావడంతో సమంత ఒదిగిపోయి సంసారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆమె తన దుడుకుతనంతో విడాకుల వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి విడాకులతో సమంతకే నష్టం కలుగుతోంది. కానీ ఆమె పట్టించుకోవడం లేదు. భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు.
సమంత, చైతుల విడాకుల్లో పిల్లల కోసం గొడవలు జరుగుతున్నట్లు మరో వార్త వెలుగులోకి వచ్చింది. సమంత సరోగసి ద్వారా పిల్లలను కనాలని భావించినట్లు చెబుతుండగా దీనికి చైతు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయినా సమంత మొండిగా ఉండడంతోనే ఇంత దూరం వచ్చిందని సమాచారం. విడాకుల కేసులో సమంతదే తప్పుగా తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం చైతును దూరం చేసుకోవడంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
సమంత విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి ఎవరిని చేసుకుంటుంది. అక్కడ మాత్రం గొడవలు జరగవా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సంసారంలో ఇద్దరు కలిసిపోయి ఉండాల్సిన సమయంలో సమంత నూరేళ్ల కాపురాన్ని పాడు చేసుకోవడం తెలివైన పని కాదు. సమంత కెరీర్ మంచి పొజిషన్ లో ఉండడంతో ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. కానీ భవిష్యత్ లో ఇంకెన్ని కష్టాలు పొంచి ఉంటాయో తెలుసుకోవడం లేదని చెబుతున్నారు.