ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లా మారింది. రోజు గడవడానికి కూడా అప్పులే చేయాల్సి వస్తోంది. దీంతో వైసీపీ కష్టాల్లో పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్వహణకు ఆస్తులను తనఖా పెట్టాల్సి వస్తోంది. దీంతో ఎక్కడైనా ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చూడలేదని ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఇలాగైతే భవిష్యత్ లో ప్రభుత్వ ఆస్తులు కనిపించకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని చెబుతున్నారు.
విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం తనఖా పెట్టిందని సమాచారం. బ్యాంకుల్లో వాటికి సంబంధించిన పత్రాలు పెట్టి రుణాలు తీసుకుంటోంది. దీంతో రాబోయే కాలంలో ప్రభుత్వ మనుగడ కష్టమేనని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాల విమర్శలను నిర్లక్ష్యం చేస్తోంది.
ఈ నేపథ్యంలో విశాఖ నాట్ ఫర్ సేల్ అంటూ బీజేపీ నేతలు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు వైసీపీ విధానాలను తప్పు బట్టారు. జగన్ నియంతృత్వ పోకడలతో రాష్ర్టం అధోగతి పాలవుతోందని దుయ్యబట్టారు. దీనిపై మేలుకోకపోతే ప్రభుత్వ ఆస్తులు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. 13 రకాల ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతోందని దుయ్యబట్టారు.