తెలంగాణలో బతుకమ్మ(Bathukamma 2021) సంబురాల సందడి మొదలైంది. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ (Bathukamma 2021)కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి తనదైన శైలిలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
మొత్తానికి మెగాస్టార్ ఈ ట్వీట్ తో తెలంగాణ ఆడపడుచుల మనసును దోచుకున్నారు. ఇక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే బతుకమ్మ (Bathukamma 2021)సంబురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఈ బతుకమ్మ సంబురాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే గాడ్ ఫాదర్ సినిమా షూట్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. అయితే మెగా అభిమానులు మాత్రం ఆచార్య రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆచార్య సినిమా నుండి ఆ మధ్య రిలీజ్ అయిన ప్రత్యేక పాట ‘లాహే లాహే’ విపరీతమైన బజ్ తో పాటు ఇప్పటకే 70 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకోవడంతో ఆచార్య పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సాంగ్ మధ్యలో చిరు వేసిన క్రేజీ స్టెప్స్ ప్రేక్షకుల్ని చాల బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.
