Homeఎంటర్టైన్మెంట్S Janaki: ఎస్ జానకి.. పాటల మలయ మారుతం.. ఆమె గొంతు ఒక అమృతం..

S Janaki: ఎస్ జానకి.. పాటల మలయ మారుతం.. ఆమె గొంతు ఒక అమృతం..

S Janaki: ఒక దశలో అంతటి ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా తట్టుకోలేకపోయాడు. జిక్కి వంటి గాయకులు కూడా చేతులెత్తేశారు. ఎందుకంటే నాటి రోజుల్లో ఎస్ జానకి పాటల ప్రవాహం అలా ఉండేది మరి.. ఎంత గొప్పగా పాటలు పాడేదంటే.. కనీసం ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండేది కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అనేక భాషల్లో ఆమె పాటలు పాడింది. ఆమె పాట పాడితే చాలు క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయేవి. నాటి […]

S Janaki: ఒక దశలో అంతటి ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా తట్టుకోలేకపోయాడు. జిక్కి వంటి గాయకులు కూడా చేతులెత్తేశారు. ఎందుకంటే నాటి రోజుల్లో ఎస్ జానకి పాటల ప్రవాహం అలా ఉండేది మరి.. ఎంత గొప్పగా పాటలు పాడేదంటే.. కనీసం ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండేది కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అనేక భాషల్లో ఆమె పాటలు పాడింది.

ఆమె పాట పాడితే చాలు క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయేవి. నాటి రోజుల్లో ఆమె గాత్రం వినిపిస్తే చాలు.. సినిమా సగం హిట్టే అయినట్టు అని దర్శకులు భావించేవారు. అందువల్లే ఎస్ జానకి ఎంత బిజీగా ఉన్నా సరే.. ఆమె కాల్ షీట్లు చూసుకొని సర్దుబాటు చేసుకునేవారు. ఎంతోమంది దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె పని చేశారు. కేవలం గాత్రంతో మాత్రమే కాకుండా.. గొంతు అనుకరణతో కూడా ఆమె సంచలనాలను సృష్టించేవారు. గొంతులు సవరించి అనేక విధాలుగా పాటలు పాడేవారు.. అలాంటి ఘనత సృష్టించిన గాయకురాలిగా జానకి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.

జానకి పుట్టింది గుంటూరు జిల్లాలోని రేపల్లె ప్రాంతంలో. 1938 ఏప్రిల్ 23న రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో ఆమె జన్మించారు. సంగీతం మీద ఇష్టంతో పాటలు పాడటం నేర్చుకున్నారు. ఆ తర్వాత తన గాత్ర మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేశారు. వేలాది పాటలు పాడారు. ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆమె శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో పాడిన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. అభినందన సినిమాలో మంచి కురిసే వేళలో.. అరే ఏమైంది.. అభిలాష సినిమాలో బంతి చామంతి.. పదహారేళ్ళ వయసు సినిమాలో సిరిమల్లె పువ్వా.. సాగర సంగమం సినిమాలో మౌనమేలనోయి.. ప్రేమ సినిమాలో ప్రియతమా నా హృదయమా.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో అందాలలో.. ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్యాసన.. సీతాకోక చిలుక సినిమాలో మాటే మంత్రము.. దళపతి సినిమాలో సుందరి నీవే.. అనే పాటలు పాడి అలరించారు.

కథానాయకకు తగ్గట్టుగా పాట పాడడం జానకమ్మ స్టైల్. రాధిక.. రాధ.. విజయశాంతి.. ఎంతమంది సినీ తారలు జానకీ కి అభిమానులు. వారు నటించిన ఎన్నో సినిమాలలో జానకి పాటలు పాడారు.. ఇప్పటికీ ఆ పాటలు ఐకానిక్ సింబల్స్ లాగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం జానకి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో గొప్ప పాటలు పాడిన ఆమె.. శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడిన ఆమె గొంతు ఇక సెలవు అంటూ వెళ్లిపోయింది.. జానకి భౌతికంగా మాత్రమే మన మధ్య లేదు. ఆమె గొంతు ద్వారా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు. మన మధ్యనే ఉంటారు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper