Thaman : సౌత్ లో ప్రస్తుతం టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్ పేరు కచ్చితంగా ఉంటుంది. మణిశర్మ వద్ద కీ పే బోర్డు ప్లేయర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన తమన్, అ తర్వాత కిక్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు తమన్(SS Thaman) కెరీర్ ఎలా కొనసాగుతూ ముందుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన అందించే పాటలకంటే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. తమన్ మ్యూజిక్ ని తట్టుకోవాలంటే థియేటర్ లో కొత్త టెక్నలాజి DTS బాక్సులు పెట్టుకోవాలి, లేకపోతే పేలిపోవడమో, కాలిపోవడమో జరుగుతుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. రీసెంట్ గానే ఆయన ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : ‘గేమ్ చేంజర్’ లో డ్యాన్స్ కంటే నీదే బాగుంది..తమన్ సెటైర్స్ వైరల్!
ఆయన మాట్లాడుతూ ‘నాకు 11 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అ సమయంలో ఇంట్లో అందరూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నారు. మా నాన్న పార్థివదేహాన్ని హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన వెంటనే మా అమ్మ కుప్ప కూలిపోయింది. అంతా జరుగుతున్నా నా కంటి నుండి ఒక్క చుక్క నీరు కూడా కారలేదు. మా అమ్మని చెల్లిని ఎలా పోషించాలి అనే ఆలోచనే ఆ క్షణంలో నా మనసులో ఉండేది. అంత చిన్న వయస్సు లో అంతటి ఆలోచన నాకు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత శివమణి గారు మా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు. ఆయన్ని చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయ్యాను. మా అమ్మ నన్ను నమ్మి మా నాన్న పోగు చేసిన LIC డబ్బులు ఇచ్చింది. వాటితో నేను మ్యూజిక్ పరికరాలు కొని సంగీతం పై ద్రుష్టి సారించాను’.
‘మా నాన్న గారి మంచితనం కారణంగా చిన్న తనం నుండే నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. SP బాలసుబ్రమణ్యం(SP Balasubrahmanyam) , శివమణి(Sivamani) వంటి వారితో పాటు ఇండస్ట్రీ లో ఎంతో మంది ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ గురించి మాట్లాడుతూ ‘ఏ సినిమాకి కూడా నేను కచ్చితంగా వందల మిలియన్ వ్యూస్ రావాలని పని చేయను. కేవలం మంచి సంగీతం ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. చాలా పాటలకు 100 మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. నా దృష్టిలో వాటికి ఇంకా రావాలి. గేమ్ చేంజర్ పాటలు చాలా చక్కగా కుదిరాయి, కానీ హుక్ స్టెప్పులు లేకపోవడం వల్ల, ఆ పాటలకు నేను ఆశించిన స్థాయి వ్యూస్ రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్. ఇకపోతే ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఓజీ'(They Call Him OG), ‘అఖండ 2′(Akhanda 2), ‘రాజా సాబ్'(Raja Saab Movie) వంటి చిత్రాలు ఉన్నాయి.
Also Read : ఓజీ మూవీ మ్యూజిక్ కి స్పీకర్స్ పగిలిపోతే నాకు సంబంధం లేదు : తమన్…