Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య… ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సూర్య ‘కంగువా ‘ అనే పిరియాడికల్ డ్రామా మూవీని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లకు పైన అవుతుందనే విషయం అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లో స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని మొదటి దసరా కనుక అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయినప్పటికీ అదే తేదీన రజనీకాంత్ ‘వెట్టయాన్ ‘ సినిమాతో బరిలోకి దిగుతుండటంతో రెండు సినిమాల మధ్య పోటీ భీకరంగా ఉంటుందంటూ పలు రకాల వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కంగువా సినిమా ప్రొడ్యూసర్స్ రజనీకాంత్ తో పోటీ ఎందుకు అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందుకే ఈ సినిమాని దీపావళి కానుక గా అక్టోబర్ 30వ తేదీన సెట్స్ మీదకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనివల్ల అటు రజినీకాంత్ సినిమాకి, ఇటు కంగువా సినిమాకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రెండు సినిమాలు కూడా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.
రజినీకాంత్ సోలోగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అనేది స్పష్టమవుతుంది. ఇక దీనివల్ల రెండు సినిమాలకు ఎలాంటి నష్టమైతే వాటిల్లదు రజనీకాంత్ సినిమా అంటే దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయి. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తోనే పెను ప్రభంజనాన్ని సృష్టించగలిగే స్టార్ హీరోల్లో రజనీకాంత్ ఒకరు. ఒక సినిమా కనక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లైతే భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో రజనీకాంత్ ఉండటం వల్లే సూర్య వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇటు రజినీకాంత్ అటు సూర్య ఇద్దరు కూడా వాళ్ళ సినిమాలతో సక్సెస్ లను సాధించి తమిళ్ సినిమా ఇండస్ట్రీని మరొక మెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More