Homeఎంటర్టైన్మెంట్Rajasekhar Brother: హీరో రాజశేఖర్ తమ్ముడు ఒక టాప్ స్టార్ అనే విషయం తెలుసా..? ఇప్పుడు...

Rajasekhar Brother: హీరో రాజశేఖర్ తమ్ముడు ఒక టాప్ స్టార్ అనే విషయం తెలుసా..? ఇప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడంటే!

Rajasekhar Brother: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు రాజశేఖర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత హీరో గా మారి సాధించిన విజయాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో ఈయన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలతో పోటీ పడేవి. వాళ్ళ సినిమాలతో సమానంగా ఓపెనింగ్ […]

Rajasekhar Brother: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు రాజశేఖర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత హీరో గా మారి సాధించిన విజయాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో ఈయన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలతో పోటీ పడేవి. వాళ్ళ సినిమాలతో సమానంగా ఓపెనింగ్ వసూళ్లను రాబట్టేవి, కొన్ని ఆల్ టైం రికార్డ్స్ కూడా రాజశేఖర్ ఖాతాలో ఉండేవి. అలా అప్పట్లో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు రాజశేఖర్. 2006 వ సంవత్సరం వరకు రాజశేఖర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఆ తర్వాత పూర్తిగా పడిపోయింది. ఇది పక్కన పెడితే రాజశేఖర్ కి ఒక తమ్ముడు ఉన్నాడని, అతను కూడా హీరో గా కొన్ని సినిమాలు చేసాడనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాజశేఖర్ తమ్ముడి పేరు చంద్ర శేఖర్. ఈయన మన టాలీవుడ్ లోకి ‘గ్యాంగ్ మాస్టర్’ అనే సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. రాజశేఖర్ తమ్ముడు అనే పలుకుబడి కూడా ఈ చిత్రానికి ఉపయోగపడలేదు. ఫలితంగా కనీసం ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత చంద్రశేఖర్ కి టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు కూడా రాలేదు. ఇక ఆ తర్వాత చంద్ర శేఖర్ తమిళం లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ ఒక్క హిట్ కూడా తగల్లేదు. దీంతో ఆయన టీవీ సీరియల్ ఆర్టిస్టుగా మారిపోయాడు. కోలీవుడ్ లో ఈయన మొదటి నుండి సెల్వ అనే పేరుతో కొనసాగుతున్నాడు.

రీసెంట్ గా ఈమధ్య కాలం లో ఈయన తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత గత ఏడాది తమిళం లో విడుదలైన ‘తనెల్’ అనే చిత్రం లో కూడా కీలక పాత్ర పోషించాడు. వెండితెర ఆడియన్స్ కంటే కూడా ఈయన ఎక్కువగా, టీవీ సీరియల్ ఆర్టిస్టుగా బుల్లితెర ఆడియన్స్ కి బాగా పరిచయం. టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో ఇతనికి ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇక రాజశేఖర్ విషయానికి వస్తే, హీరో గా ఆయన కెరీర్ పూర్తి అవ్వడం తో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. శర్వానంద్ బైకర్, విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు రాజశేఖర్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper