Rajamouli Chiranjeevi Nagarjuna Missed Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ హిట్టుగా నిలవడంతో ఆయన పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రపంచస్థాయి ప్రేక్షకులందరు తన నుంచి సినిమా వస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా రాజమౌళి కథ విషయంలో గానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో గానీ క్లారిటీగా ఉంటాడు. అందువల్లే అతనికి వరుస సక్సెసులు వస్తున్నాయంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…వారణాసి సినిమా విషయంలో కూడా ఆయన అలాంటి పద్ధతిని పాటిస్తున్నాడు…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు రాజమౌళి చేసిన కొద్ది సినిమాలతోనే తెచ్చుకున్నాడు. కాబట్టి అతనికి ఇండస్ట్రీలో చాలా ఎక్కువ పాపులారిటి ఉందనే చెప్పాలి… ఇక కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి సింహాద్రి సినిమా తర్వాత చిరంజీవిని, నాగార్జున ను పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు.
కానీ అప్పుడు అది వర్కౌట్ కాలేదు కారణం ఏంటి అంటే చిరంజీవి తన సినిమాలతో బిజీగా ఉండటం, నాగార్జున సైతం వరుసగా నాలుగు సినిమాలకు కమిటై ఉండడం వల్ల రాజమౌళి ఆ ప్రాజెక్టుని చేయలేకపోయారట.
విజయేంద్రప్రసాద్ సైతం కథ ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికీ ఆ కథ అలాగే ఉందట. ఇక ఫ్యూచర్ లో అయిన వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా లేదంటే అదే కథని ఇంకెవరైనా ఇద్దరు హీరోలను పెట్టి సినిమాను చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రాజమౌళి నుంచి వచ్చే సినిమా నెక్స్ట్ లెవల్లో నిలుస్తుందనేది వాస్తవం…
