Pawan Kalyan: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు పవన్ కళ్యాణ్… మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. అప్పట్లో చాలామందికి పెద్ద దర్శకులు సినిమా చేయడానికి ప్రయత్నం చేసిన కూడా ఒక దర్శకుడు మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కే రాఘవేంద్ర రావు కావడం విశేషం… ఆయన అప్పట్లో టాప్ డైరెక్టర్ గా వెలుగొందాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి పవన్ కళ్యాణ్ తో ఒక యూత్ ఫుల్ సినిమా చేస్తే బాగుంటుందని కొంతమంది చెప్పిన కూడా రాఘవేంద్రరావు ఎందుకో పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదట.
కారణం ఏంటి అంటే అప్పటికే రాఘవేంద్రరావు ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కి సరిపడా యూత్ ఫుల్ ప్రాజెక్టు దొరక్కపోవడం వల్ల అయి ఉండొచ్చు. మొత్తానికైతే రాఘవేంద్రరావు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదనే వార్తలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి…
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిని పక్కనపెట్టి టాప్ లెవెల్ కి వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. రాఘవేంద్ర రావు ప్రస్తుతం 80 సంవత్సరాల పైబడిన వయసులో ఉన్నాడు. కాబట్టి తను సినిమాలకు దూరంగా ఉంటున్నాడు…
ఇకమీదట పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడట. రీసెంట్ గా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో తన తదుపరి సినిమాల విషయంలో దర్శకులకు కొన్ని కండిషన్స్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ సినిమా లను సెలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
