Pushpa Jagadish: సుకుమార్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కేశవ పాత్రలో నటించి తనదైన మార్క్ నటన చూపిస్తూ మంచి గుర్తింపు పొందిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారు. పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ తో చాలా సినిమాల్లో చేస్తూ నటుడిగా రాణిస్తూ తనకంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.
అయితే రీసెంట్ గా పంజాగుట్ట పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈయన గత కొద్ది రోజులుగా ఒక జూనియర్ నటిని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె సినిమాల్లో నటిస్తూ నటిగా బిజీ అవ్వాలని కోరుకుంటున్న సమయంలో తనకి జగదీష్ పరిచయం అయ్యాడు. ఇక జగదీష్ తో సన్నిహితంగా ఉంటు వస్తుంది ఇక ఇదే సమయంలో ఆమె వేరే పర్సన్ తో ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోలను తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇక ఆమె ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దాంతో జగదీష్ ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో సబ్మిట్ చేశారు…
ఇక ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమం లో మనకు చాలా మంది పరిచయం అవుతారు. వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండి మన పని మనం చూసుకుంటూ వెళ్లాలి. మన ఆనందం కోసం వేరే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడం తప్పు… ఇంక దానికి తోడుగా ప్రాణం తీసుకొనే రేంజ్ లో టార్చర్ పెట్టాడమంటే మామూలు విషయం కాదు. ఆయనే ఎంతగా ఆమెని.ఇబ్బంది పెట్టీ ఉంటే ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఆ అమ్మాయి కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇక ఆమె మరణం వార్త తెలిసాక చాలా రోజుల నుంచి పోలీసులు జగదీష్ కోసం వెతుకుతుండగా ఆయన మాత్రం పోలీసులకి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
రీసెంట్ గా అతన్ని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి కొర్ట్ కు సబ్మిట్ చేయడంతో ఆయన్ని ప్రస్తుతానికి రిమాండ్ లో ఉంచినట్టు గా తెలుస్తుంది…సినిమాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న క్రమంలో ఇలాంటి కేసులు, గొడవలు పెట్టుకొని సినిమా కెరియర్ ని నాశనం చేసుకుంటున్నాడు అంటూ సినీ మేధావులు సైతం జగదీష్ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…