spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2 విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేసిన నిర్మాతలు!

Pushpa 2: పుష్ప 2 విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేసిన నిర్మాతలు!

Pushpa 2: పుష్ప విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఆ చిత్ర సీక్వెల్ పై మాత్రం హైప్ నడుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ మీడియా జరిపిన సర్వేలో టాప్ 5 మోస్ట్ అవైటెడ్ హిందీ చిత్రాల్లో మొదటి స్థానం పుష్ప 2కి దక్కింది. స్థానిక స్టార్ హీరోల అప్ కమింగ్ చిత్రాల కంటే కూడా పుష్ప 2 మీదే జనాలకు ఆసక్తి ఉంది. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు. కొంత షూటింగ్ జరిగాక… ఐదు భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

దర్శకుడు సుకుమార్ ఆలోచన మంచి ఫలితాన్ని ఇచ్చింది. పుష్ప భారీ విజయం సాధించింది. హిందీలో మొదటి రోజు కేవలం రూ. 3 కోట్లు వసూలు చేసిన పుష్ప… వర్డ్ ఆఫ్ మౌత్ తో మెల్లగా పుంజుకుంది. ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ పుష్ప రూ. 360 కోట్ల గ్రాస్ అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు.

పుష్ప తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 బడ్జెట్ మూడు రెట్లు పెంచారు. పుష్ప 2 దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ క్రమంలో మరింత క్వాలిటీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే పుష్ప 2 వాయిదా పడొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. పుష్ప 2లో కీలక రోల్ చేస్తున్న నటుడు జగదీష్ ప్రతాప్ ఇటీవల ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యాడు.

జగదీష్ జైలుపాలు కావడంతో చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడిందని, అనుకున్న ప్రకారం విడుదలయ్యే అవకాశం లేదంటూ పుకార్లు వినిపించాయి. ఈ ఊహాగానాలను పుష్ప నిర్మాతలు ఖండించారు. చెప్పినట్లే పుష్ప 2 ఇండిపెండెన్స్ డే నాడు విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్. సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper