Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya: ఈ వయస్సులో ఇవేమి పనులు అనసూయ..సంచలనం రేపుతున్న వీడియో!

Anchor Anasuya: ఈ వయస్సులో ఇవేమి పనులు అనసూయ..సంచలనం రేపుతున్న వీడియో!

Anchor Anasuya: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలల్లో ఒకరు యాంకర్ అనసూయ. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈమె అప్లోడ్ చేసే పోస్టులకు , వీడియోలకు రెస్పాన్స్ మామూలు రేంజ్ లో ఉండదు. ఈమె చాలా బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి , ఈమె పై నెగెటివిటీ సోషల్ మీడియా లో చాలా గట్టిగానే ఉంటుంది. అయితే ఈమె అప్లోడ్ చేసే వర్కౌట్ వీడియోస్ కి […]

Anchor Anasuya: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలల్లో ఒకరు యాంకర్ అనసూయ. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈమె అప్లోడ్ చేసే పోస్టులకు , వీడియోలకు రెస్పాన్స్ మామూలు రేంజ్ లో ఉండదు. ఈమె చాలా బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి , ఈమె పై నెగెటివిటీ సోషల్ మీడియా లో చాలా గట్టిగానే ఉంటుంది. అయితే ఈమె అప్లోడ్ చేసే వర్కౌట్ వీడియోస్ కి మాత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ , ఈ వయస్సు లో ఆమెకు ఇంతటి స్ట్రెంగ్త్ ఎలా ఉందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమెకంటూ ప్రత్యేకంగా జిం ట్రైనర్లు ఉండరు. తన సొంతంగానే వర్కౌట్స్ చేసుకుంటుంది. తనకు తెలిసిన ట్రిక్స్ ని నెటిజెన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

అలా రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక వర్కౌట్ వీడియో సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఓపిక ఉన్నా లేకపోయినా , మనకోసం మనం షో అప్ చేసుకోవాలి. బలం ఒక్క రోజులో రాదు. ప్రతీ రోజు మనం కష్టపడే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఇక ఆలోచించడం ఆపేసి , లేచి వర్కౌట్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఆమె ఈరోజే కాదు , ప్రతీ రోజు వర్కౌట్స్ గురించి మోటివేషనల్ వీడియోస్ చేస్తూనే ఉంటుంది. ఈ ఒక్క విషయం లో మాత్రం అనసూయ పై నెటిజెన్స్ లో మంచి అభిప్రాయం ఏర్పడింది. వర్కౌట్స్ ఈ రేంజ్ లో హీరోయిన్స్ కూడా చేయడం లేదు , అనసూయ ఈ వయస్సు లో కూడా అదరగొట్టేస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అనసూయ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే, ఈమెకు గతం లో ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. అడపాదడపా చిన్న సినిమాలు చేస్తోంది కానీ , ఒకప్పటి లాగా పెద్ద సినిమాల్లో నటించడం లేదు. ఎక్కువ శాతం వివాదాలకే పరిమితం అవుతోంది. అయితే ఈమధ్య కాలం లో ఈమె సుకుమార్ ప్రతీ సినిమాలోనూ ఉంటుంది కాబట్టి , కచ్చితంగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే రామ్ చరణ్ -సుకుమార్ సినిమాలో ఈమెకు బలమైన పాత్ర దక్కే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper