Prakash Raj: తిరుపతి లడ్డు వివాదం రోజురోజుకి ముదురుతోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. ఘోరమైన దోషం జరిగినందున ‘ప్రాయశ్చిత్త దీక్ష’ ని 11 రోజుల పాటు చేస్తున్నాడు. అక్టోబర్ 3 వ తేదీన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఈ దీక్ష ని విరమించబోతున్నాడు. అదే రోజున ఆయన తిరుపతి లో వారాహి సభ ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ జరిగిన ఈ ఘటనను ముక్త కంఠం ఖండించడం మానేసి, ఇందులో తప్పులు వెతికిన నటుడు ప్రకాష్ రాజ్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అదే విధంగా ఈ ఘటనని తన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫన్నీ సందర్భంలో వాడినందుకు హీరో కార్తిపై కూడా ఆయన మండిపడ్డాడు. తన వ్యాఖ్యల గురించి పవన్ కళ్యాణ్ స్పందన పై నిన్న ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ‘నేను చెప్పిన దానిని అపార్థం చేసుకున్నారు..నేను ఇండియా కి వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక నేడు కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పడం పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ‘చేయని తప్పుకి క్షమాపణలు చెప్పించుకొని ఆనందాన్ని పొందాలనుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు’ అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు విసిరాడు. దీనికి పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అసలు నువ్వు ఎవడివి రా మధ్యలో’ అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఇస్తున్నారు. మంచి మిత్రులుగా, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండే వీళ్లిద్దరు పరస్పరం ఇలా ఒకరినొకరు విమర్శించుకోవడం పై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. సినిమాల్లో వీళ్ళిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘జల్సా’, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’, ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు. ఈ సినిమాల్లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరు కలిసి ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉంది. వీళ్ళ కాంబినేషన్ లో సన్నివేశాలు చిత్రీకరించాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న వివాదం చూస్తుంటే ప్రకాష్ రాజ్ ఈ సినిమా చేస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది. ప్రకాష్ రాజ్ ని చూస్తుంటే ఈ వివాదానికి ఫులు స్టాప్ పెట్టెలాగా అనిపించడం లేదు. సెప్టెంబర్ 30 న ఆయన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని నిన్న వీడియో లో చెప్పుకొచ్చాడు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఇంకెన్ని పరిణామాలు ఎదురు అవుతాయో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More