Homeఎంటర్టైన్మెంట్ఓన్లీ ప్రభాస్ కే పరిమితం అవుతుందా ?

ఓన్లీ ప్రభాస్ కే పరిమితం అవుతుందా ?

బాలీవుడ్ బ్యూటీ ‘కృతి సనన్’ ఎప్పుడో ఏడేళ్ల క్రితం మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. కానీ, ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో అమ్మడికి క్రేజ్ రాలేదు. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచెయ్’ అనే సినిమా కూడా చేసింది. ఆ సినిమా కూడా డిజాస్టర్లకు సింబాలిక్ గా మారిపోవడంతో ఇక ‘కృతి సనన్’ మళ్ళీ తెలుగులో నటించడానికి ఇంట్రస్ట్ చూపించలేదు. అంతలో బాలీవుడ్ లో ఈ బ్యూటీకి డిమాండ్ […]

Adipurush
బాలీవుడ్ బ్యూటీ ‘కృతి సనన్’ ఎప్పుడో ఏడేళ్ల క్రితం మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. కానీ, ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో అమ్మడికి క్రేజ్ రాలేదు. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచెయ్’ అనే సినిమా కూడా చేసింది. ఆ సినిమా కూడా డిజాస్టర్లకు సింబాలిక్ గా మారిపోవడంతో ఇక ‘కృతి సనన్’ మళ్ళీ తెలుగులో నటించడానికి ఇంట్రస్ట్ చూపించలేదు. అంతలో బాలీవుడ్ లో ఈ బ్యూటీకి డిమాండ్ పెరగడం, అనుకోకుండా స్టార్ డమ్ రావడంతో ‘కృతి’ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

Also Read: ‘జాతిరత్నాలు’ ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే..?

అయితే ‘కృతి సనన్’ మళ్ళీ ఇన్నేళ్లకు మరో తెలుగు స్టార్ తో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ కి జోడిగా కనిపించబోతుంది. ఇది పూర్తిగా తెలుగు చిత్రం కాకపోవడం, బాలీవుడ్ లో ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉండటం, అలాగే ఆదిపురుష్ మేకర్స్ కూడా మొత్తం బాలీవుడ్ వారే కావడంతో.. ఈ సినిమాని బాలీవుడ్ మూవీగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే తనకు బాలీవుడ్ లో మంచి పొజిషన్ ఉన్నా… “బరేలి కి బర్ఫీ”, “హౌస్ ఫుల్ 4” వంటి బాలీవుడ్ హిట్ సినిమాలు తన ఖాతాలో ఉన్నా ఈ సినిమాకి ఎలాంటి డిమాండ్స్ పెట్టకుండా ఒప్పుకుంది.

Also Read: బోయ‌పాటి చెప్పిందే వేద‌మా? బీబీ-3లో ఏం జ‌రుగుతోంది?

పైగా ప్రభాస్ సరసన ఛాన్స్ కాబట్టే ఎగిరి గంతేసి ఒప్పుకొందట. అదే మరో తెలుగు హీరో అయి ఉంటే ఒప్పుకునేది కాదట. ఇక ఆదిపురుష్ సినిమాలో ఆమె సీతగా నటిస్తోంది. ఈ పాత్రకు ముందుగా అనుష్క శర్మ, కియారా అద్వానీని పరిశీలించినా.. వాళ్ళ డిమాండ్స్ ఎక్కువుగా ఉండటంతో, ఫైనల్ గా కృతిని ఈ పాత్ర వరించింది. మరి భవిష్యత్తులోనైనా ఈ భామ ఇతర టాలీవుడ్ పెద్ద హీరోల సరసన సినిమాలు ఒప్పుకుంటుందా లేక ఓన్లీ ప్రభాస్ వరికే పరిమితం అవుతుందా ? అనేది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper