spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’.. అంతకుమించి మాస్.. ఎప్పుడొస్తుందంటే?

Prabhas Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’.. అంతకుమించి మాస్.. ఎప్పుడొస్తుందంటే?

Prabhas Spirit Movie: చేతిలో ఐదుకు పైగా సినిమాలతో ప్రభాస్ బిజీగా మారాడు. కనీసం రెండేళ్ల తరువాత గానీ ఆయన కొత్త సినిమాను స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ రెబల్ స్టార్ మాత్రం తన వద్ద ఉన్నసినిమాలన్నింటినీ మొదలు పెట్టేశాడు. లేటేస్టుగా ఆది పురుష్ ను పూర్తి చేసుకొని సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సందీప్ వంగాతో కలిసి ‘స్పిరిట్’ ను కూడా స్టార్ట్ చేశాడు. ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్స్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇందులో ప్రభాస్ కొత్త లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ వంగా పెద్ద ప్లానే వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమా తరువాత సందీప్ వంగా దీనిని హిందీలోనూ ఆయన డైరెక్షన్లోనే రిలీజ్ చేశాడు. అక్కడా తన ప్రతాపం చూపించాడు. ఒకే ఒక్క సినిమాతో సందీప్ వంగా పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఆ వెంటనే ప్రభాస్ తో ‘స్పిరిట్’తో కమిట్ అయింది. ఈ సినిమా పోస్టర్ ను చూసి ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ ను ఇలా ఎన్నడూ చూడలేదని అంటున్నారు.

లవర్ బాయ్ లా ఉన్న విజయ్ దేవరకొండను ‘రౌడీ హీరో’గా మార్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ ను అంతకు మించి తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ ను తెలుగు, హిందీలోనే కాకుండా కొత్తగా ఆలోచించిన సందీప్ వంగా ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేస్తున్నాడు. అందుకు అనుగుణంగా హాలీవుడ్ లెవల్లో సీన్స్ ను తీస్తున్నాడట. ఇందు కోసం స్పెషల్ టీంను తీసుకున్నారట. బహుబలి తరువాత ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ తగలలేదు. ఆ తరువాత భారీ బడ్జెట్ లో తీసిన సాహో, రాధేశ్యామ్ నిరాశ పరిచాయి. కానీ సందీప్ వంగా భారీ బడ్జెట్ తో పాటు షాకిచ్చే కథను రెడీ చేసుకున్నాడట. ఆయన కథకు అనుగుణంగానే ప్రభాస్ లుక్ మార్చేశాడు.

ఈ ఏడాది చివరిలోగా ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది మారుతి సినిమాతో పాటు స్పిరిట్ వస్తుందని అంటున్నారు. అంతకుముందే తీసుకొస్తారా? అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. అయితే స్పిరిట్ వాతావరణం చూస్తుంటే ఫ్యాన్స్ ఆగలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రభాస్ ఈ లుక్స్ లో ఎప్పుడు కనిపిస్తారా? అని వెయిట్ చేస్తున్నారు. వారికి అనుగుణంగా సందీప్ వంగా మంచి ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper