Prabhas Rajamouli Comments: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)… కెరియర్ మొదట్లో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తూ ఆయా హీరోలకు స్టార్ డమ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఆయన సినిమాల్లో సింహాద్రి (Simhadri) సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ఛత్రపతి (Chatrapathi) సినిమా కూడా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా ప్రభాస్ ను స్టార్ హీరోగా మార్చేసింది…ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సినిమా యూనిట్ మొత్తం ఒక క్రికెట్ మ్యాచ్ ని అరేంజ్ చేశారు. అయితే దానికి సంబంధించి ఎవరెవరు ఎలాంటి ప్లాన్లు వేశారు అనేది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. నటుడు అజయ్ తో పాటు ఇంకా షఫీ లాంటి నటులు స్నూకర్ ఆడుతుంటే ప్రభాస్ కోపంగా వచ్చి గేమ్ చెడగొట్టి ఛత్రపతి (Chatrapathi) సినిమా ఎవరి వల్ల హిట్ అయింది అని అడుగుతాడు. దాంతో వారు నీవల్లే అని చెప్పినప్పటికి ప్రభాస్ మాత్రం డైరెక్టర్ ఏంటి మరి తన వల్ల హిట్ అయిందని చెప్పుకుంటున్నాడు అంటూ వాళ్లతో చెబుతాడు.
Also Read: బయటపడ్డ అల్లు అర్జున్ గ్లోబల్ ఫేమ్, పడి చచ్చారు
దాంతో వాళ్లు మనం కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడదామని అందులో సెంథిల్ ఉండకూడదని అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ క్రమంలో ప్రభాస్ విలన్ ఛత్రపతి అంటూ డైలాగ్ కూడా చెబుతాడు ప్రస్తుతం ఆ వీడియో లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈ వీడియో ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు… ఇక ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఇలాంటి ఒక వీడియో చేశారని అప్పట్లో రాజమౌళి క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడమే కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్తుండడం విశేషం…
Also Read: మహేష్ బాబు ను పక్కన పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్…కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…
వీళ్ళ కాంబినేషన్లో ఆ తర్వాత బాహుబలి సినిమా రావడం అది సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో ప్రభాస్ ని నెంబర్ వన్ హీరోగా మార్చిన సినిమా కూడా అదే కావడం విశేషం…ప్రస్తుతం ప్రభాస్ సైతం పలు ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు…అయితే వీళ్ళిద్దరిలో కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు… చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది…