Mahesh Babu vs Boyapati: సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ(Krishna)కి చాలా మంచి క్రేజ్ అయితే ఉండేది. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రాజకుమారుడు (Rajakumarudu) సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుతూ నటించి మెప్పించిన మహేష్ బాబు ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు… ఇక ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న బోయపాటి శ్రీను ని ఆ తర్వాత బోయపాటిని పిలిపించుకొని తన కోసం ఒక మంచి కథ చేయమని అడగగా బోయపాటి మాత్రం మహేష్ బాబు మాటను లైట్ తీసుకుని వెంకటేష్ (Venkatesh) తులసి (Tulasi)సినిమా చేశాడు.అయితే బోయపాటి అప్పటికే వెంకటేష్ తో సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది…ఇక అప్పటినుంచి బోయపాటికి మహేష్ బాబుకి మధ్య సన్నిహిత సంబంధాలతో లేవు. అయినప్పటికి బోయపాటి మరోసారి మహేష్ బాబును కలిసి ఒక కథను వినిపించినప్పటికి ఆయన ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ నుంచి పిలుపు వచ్చినప్పుడు బోయపాటి ఒక మంచి కథ చేసుకుని ఉంటే బాగుండేదని అలా కాకుండా వేరే హీరోతో సినిమా చేసి మహేష్ బాబు మాటకు గౌరవం ఇవ్వకుండా చేశాడని కొంతమంది కొన్ని అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబుతో ఇప్పుడు ఆయన సినిమా చేయాలని అనుకున్నప్పటికి మహేష్ బాబు మాత్రం ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
Also Read: స్పిరిట్’ నుండి సెన్సేషనల్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక ప్రతీరోజు పండగే
కాబట్టి తనతో సినిమా చేసే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట మహేష్ బాబు ఫ్యాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి తను చేయబోయే సినిమాలు పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఆయన ఏ సినిమా చేసినా కూడా అందులో వైవిధ్యభరితమైన కథాంశం ఉండే విధంగా ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నాడు. ఇక రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను శాసించి గొప్ప విజయాన్ని సంపాదించుకొని తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: బయటపడ్డ అల్లు అర్జున్ గ్లోబల్ ఫేమ్, పడి చచ్చారు
ఇక మహేష్ బాబు ఇంటర్ కెరియర్ లో ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు. ముఖ్యంగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేసిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలైతే అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టినవే కాకుండా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి. ఇక మహేష్ బాబు ఎంటైర్ కెరియర్ లో టాప్ ఫైవ్ సినిమాల్లో ఈ రెండు సినిమాలు నిలుస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…