HomeNewsPrabhas Kalki 2 remuneration : రెమ్యూనరేషన్స్ లో మరోసారి టాప్ లో నిలిచిన ప్రభాస్......

Prabhas Kalki 2 remuneration : రెమ్యూనరేషన్స్ లో మరోసారి టాప్ లో నిలిచిన ప్రభాస్… ఎందయ్యా ఈ అరాచకం…

Prabhas Kalki 2 remuneration : ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా నటుడిగా తను సక్సెస్ అయ్యాడు. ఇక ఆ సినిమా తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ సినిమా సైతం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. కానీ ‘వర్షం’ సినిమాతో మాత్రం తను హీరోగా మారడమే కాకుండా మాస్ హీరోగా అవతరించాడు. ఇక చత్రపతి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం […]

Prabhas Kalki 2 remuneration : ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా నటుడిగా తను సక్సెస్ అయ్యాడు. ఇక ఆ సినిమా తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ సినిమా సైతం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. కానీ ‘వర్షం’ సినిమాతో మాత్రం తను హీరోగా మారడమే కాకుండా మాస్ హీరోగా అవతరించాడు. ఇక చత్రపతి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తనను టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని అలరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతుండటం విశేషం… ఆయన నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటుకున్న ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో భారీ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ‘కల్కి 2’ సినిమా కోసం ఆయన భారీ ఎత్తున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన బజ్ ఉంది. ఎందుకంటే ‘కల్కి’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కల్కి పైన ప్రతి ఒక్కరు భారీ ఆశలైతే పెట్టుకున్నారు. ప్రభాస్ ఇలా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే మిగతా సినిమాలకు ఇబ్బంది అవుతుంది అంటూ మరికొందరు కామెంట్లయితే చేస్తున్నారు…ఇక వాటన్నింటికి సమాధానం చెబుతూ ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు.

ఇక ఈ సినిమా తర్వాత మరోసారి తన రెమ్యూనరేషన్ భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి… ప్రస్తుతం ఆయన ‘హను రాఘవపూడి’ దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ ఇయర్ ఎండింగ్ నుంచి ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper