Homeఎంటర్టైన్మెంట్Prashna Ravana Bail: పోసాని కి 3 నెలలు జైలు.. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే...

Prashna Ravana Bail: పోసాని కి 3 నెలలు జైలు.. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ‘ప్రశ్న రావణ్’ కి బెయిల్ మీద బెయిల్..

Prashna Ravana Bail: కొన్ని సందర్భాల్లో మన దేశంలోని న్యాయ వ్యవస్థని చూస్తే కోపం రాక తప్పదు. ఒకరికి ఒక న్యాయం , మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా తయారు అయ్యింది పరిస్థితి. ఉదాహరణకి మన ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులనే తీసుకుందాం. వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులూ హద్దులు దాటి మరీ తమ నోటికి పని చెప్పారు. కొడాలి నాని , గుడివాడ అమర్ నాధ్ , పోసాని […]

Prashna Ravana Bail: కొన్ని సందర్భాల్లో మన దేశంలోని న్యాయ వ్యవస్థని చూస్తే కోపం రాక తప్పదు. ఒకరికి ఒక న్యాయం , మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా తయారు అయ్యింది పరిస్థితి. ఉదాహరణకి మన ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులనే తీసుకుందాం. వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులూ హద్దులు దాటి మరీ తమ నోటికి పని చెప్పారు. కొడాలి నాని , గుడివాడ అమర్ నాధ్ , పోసాని కృష్ణ మురళి , బోరుగడ్డ అనిల్ , వల్లభనేని వంశీ ఇలా ఒక్కరా ఇద్దరా , పెద్ద లిస్తే ఉంది. వీరిలో పోసాని కృష్ణ మురళి , బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ లకు జైలు శిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. వీళ్ళు కేవలం సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను మాత్రమే దూషించారు.

దానికే పోసాని కృష్ణ మురళి 3 నెలలు , వల్లభనేని వంశి దాదాపుగా 9 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. వాళ్లకు బెయిల్ అంత సులువుగా అయితే రాలేదు. కానీ ప్రశ్న రావణ్ కి మాత్రం మంచి నీళ్లు తాగినంత తేలికగా బెయిల్ వస్తోంది. ఇదే అందరికీ అంతు చిక్కని ప్రశ్న. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే , ఏ దళిత క్రైస్తవ సభలో చంద్రబాబు ని దూషించిన జర్నలిస్ట్ కేవీఆర్ ని అరెస్ట్ చేసి , కోర్టు ద్వారా 14 రోజులు రిమాండ్ వచ్చేలా చేశారో, అదే సభలో పవన్ కళ్యాణ్ ని , హిందువులను , సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసిన రావణ్ కి మాత్రం రిమాండ్ వచ్చేలా చేయలేకపోయారు. చాలా తేలికగా అతని మీద నమోదైన కేసులకు బెయిల్ మంజూరు అవుతూ వస్తోంది. ఇది దేనికి సంకేతం?, కావాలనే చంద్రబాబు కి సంబంధించిన వర్గం రావణ్ ని కాపాడుతూ , పవన్ కళ్యాణ్ పై నెగెటివిటీ పెరిగేలా చేస్తున్నారా అనే అనుమానం కూడా జనాల్లో కలుగుతోంది.

తన ప్రతీ విడియోలోను హిందువుల పై రావణ్ కి ఉన్న అక్కసు తెలుస్తూనే ఉంది , వాళ్లపై ఆయన పగతో రగిలిపోతూ చేసే కామెంట్స్ ని చూస్తే చీము నెత్తురు ఉన్న ఏ హిందువుకి అయినా రక్తం మరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అలా విద్వేషాలను రెచ్చగొట్టే మనిషికి బెయిల్ ఎలా లభిస్తోంది?, ఇప్పటికే మూడు ప్రాంతాల్లో అతనికి బెయిల్ లభించింది. ఇప్పుడు అనకాపల్లి కి తీసుకెళ్లారు , అక్కడ కూడా బెయిల్ వచ్చేలా చేస్తారు ఇలా న్యాయవ్యవస్థలే ఇలాంటోళ్లని కాపాడడం మొదలు పెడితే , బయటకి వచ్చిన తర్వాత ఇక ఇతగాడు ఇంకా ఎన్ని మాత విద్వేషాలను రెచ్చగొడుతాడు?, కాస్త అయినా కోర్టులు వీటిని పరిగణలోకి తీసుకోవా?, పైగా ఇలాంటి వ్యక్తులకు ప్రకాష్ రాజ్ లాంటోళ్ళు సపోర్టు ఇవ్వడం దురదృష్టకరం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులను తీసుకుంటుందో అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper