Homeఎంటర్టైన్మెంట్Peddi new version movie: 5 నిమిషాల సరికొత్త ఫుటేజీ తో రేపటి నుండి థియేటర్స్...

Peddi new version movie: 5 నిమిషాల సరికొత్త ఫుటేజీ తో రేపటి నుండి థియేటర్స్ లో ‘పెద్ది’ కొత్త వెర్షన్..

Peddi new version movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీ వేవ్ ని మనం ప్రతీ రోజు కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ చల్లారిపోయే రోజులు ఇవి. అలాంటిది ‘పెద్ది’ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే వరుసగా 12 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందంటే , ఈ చిత్రం […]

Peddi new version movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీ వేవ్ ని మనం ప్రతీ రోజు కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ చల్లారిపోయే రోజులు ఇవి. అలాంటిది ‘పెద్ది’ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే వరుసగా 12 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందంటే , ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 21 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. నేడు కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు కచ్చితంగా వచ్చేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలోని పాటలను మొత్తం రీసెంట్ గా యూట్యూబ్ లో విడుదల చేసేశారు .

దీనిపై అభిమానులు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. ‘పెద్ది’ చిత్రానికి వీడియో సాంగ్స్ చాలా పెద్ద పాజిటివ్. అలాంటి వీడియో సాంగ్స్ మొత్తాన్ని యూట్యూబ్ లో పెట్టేసారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిపీట్ లో చూడాలని అనుకున్న ఆడియన్స్ పరిస్థితి ఏంటి?, ఇంత తెలివి తక్కువ పని మేకర్స్ ఎలా చేశారు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అయితే రేపటి నుండి సరికొత్త సన్నివేశాలను జత చేయబోతున్నారు అట మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 5 నిమిషాల 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ కొత్త సన్నివేశాల కారణంగా కలెక్షన్స్ రేపటి నుండి ఇంకా బాగా పెరుగుతాయని, వీకెండ్ కి రామ్ చరణ్ దుమ్ము లేపేస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి. జగపతి బాబు , రామ్ చరణ్ కి మధ్య ఉన్న కొన్ని సన్నివేశాలను జత చేస్తున్నారట.

అదే విధంగా శివరాజ్ కుమార్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని , హీరోయిన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్ మధ్య వచ్చే కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి , వాటి స్థానం లో రెండు మంచి సన్నివేశాలు జత చేశారట. నేడు ఈ కొత్త సన్నివేశాలకు రామ్ చరణ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. గతం లో కొత్త సన్నివేశాలు జత చేయడం వల్ల , శంకర్ దాదా MBBS , మగధీర, మిర్చి , పుష్ప 2 వంటి సినిమాలకు లాంగ్ రన్ లో కలెక్షన్స్ అదనంగా కలిసొచ్చాయి, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రానికి కూడా అదే విధంగా వర్కౌట్ అవ్వుద్దని భావిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper