spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Pre Release Business: కేవలం ఆ 2 ప్రాంతాల నుండే 100 కోట్లు.....

Peddi Movie Pre Release Business: కేవలం ఆ 2 ప్రాంతాల నుండే 100 కోట్లు.. చరిత్ర తిరగరాస్తున్న ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్..

Peddi Movie Pre Release Business: ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఈ నెల 30 న వస్తుందో లేదో అనేది స్పష్టమైన క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు కానీ , ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. ఈ రేంజ్ బిజినెస్ ఈమధ్య కాలంలో ఏ స్టార్ హీరో కి కూడా జరగలేదు. రాయలసీమ ప్రాంతం లో రామ్ చరణ్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఎన్నో మొదటి రోజు రికార్డ్స్ , అదే విధంగా లాంగ్ రన్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉండడం తో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరుగుతోంది . కడప , చిత్తూరు, అనంతపురం, ఇలా రాయలసీమ అన్ని జిల్లాకు కలిపి ఈ చిత్రం 33 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అట.

ఇదొక ఆల్ టైం ప్రీ రిలీజ్ రికార్డు థియేట్రికల్ బిజినెస్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. నైజాం ప్రాంతం లో కూడా నిన్ననే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని 63 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అలా కేవలం ఈ 2 ప్రాంతాల నుండే ఈ చిత్రానికి దాదాపుగా 100 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కేవలం తెలుగు వెర్షన్ బిజినెస్ 300 కోట్ల రూపాయలకు జరిగే సూచనలు కనిపిస్తుండగా, హిందీ మరియు ఇతర భాషలకు కలిపి మరో 100 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

మొత్తం మీద ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయిల బిసినెస్ కేవలం థియేట్రికల్ వెర్షన్ కి జరిగిందని , టాక్ కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ లెవెల్ లో వస్తే కానీ ఈ బిజినెస్ రికవర్ అయ్యే అవకాశాలే కనిపించడం లేదని అంటున్నారు. అయితే ఈ బిజినెస్ కేవలం ఏప్రిల్ 30 ని దృష్టిలో పెట్టుకొని జరుగుతోంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం 30 శాతానికి పైగా బిజినెస్ తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. VFX మరియు ఐటెం సాంగ్ చిత్రీకరణ ఒకటే బ్యాలన్స్ ఉందట. ఈ నెల 8 లోపు స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆరోజే పూర్తి స్థాయిలో మొదలు కానున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper