Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పబోతున్నాడు. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో బంధు మిత్రుల సమక్షం లో గ్రాండ్ గా కిరణ్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు మెగా హీరోలందరూ వచ్చారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి , పైగా స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నాయి , ఫుల్ బిజీ గా ఉండొచ్చు, కానీ ఎంతైనా తన ఇంట్లోని అక్క కొడుకు నిశ్చితార్థం జరుగుతుంది కాబట్టి, బాధ్యతగా హాజరు అవ్వాలి కదా , ఎందుకని రాలేదు ? అంటూ సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఆయన సతీమణి అన్నా లెజినోవా ఇలాంటి ఈవెంట్స్ కి వస్తుండేది, కానీ ఆమె కూడా నిన్న రాకపోవడం తో అభిమానులు నిరాశకు గురయ్యారు.
సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ బంధం ఎంతో స్పెషల్, తన సొంత కొడుకు లాగా చూసుకునేవాడు పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీ కి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతీ హీరో ని మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేయగా, సాయి ధరమ్ తేజ్ ని మాత్రం పవన్ కళ్యాణ్ పరిచయం చేసాడు. దీన్ని బట్టీ ఆయనకు సాయి ధరమ్ తేజ్ ఎంత స్పెషల్ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్ధ వేడుకకు పవన్ కళ్యాణ్ రాకపోవడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతం లో వరుణ్ తేజ్ నిశ్చితార్థం కి పవన్ కళ్యాణ్ ఎన్ని పనులు ఉన్నా మానుకొని వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ కి కూడా అలాగే వచ్చి ఉండుంటే బాగుండేదని అంటున్నారు నెటిజెన్స్. కనీసం పెళ్ళికి అయినా వస్తాడో లేదో చూడాలని అంటున్నారు నెటిజెన్స్.