Bigg Boss 10 Telugu: సోషల్ మీడియా లో గత నాలుగు రోజుల నుండి రోహిత్ అనే పేరు ఎలా వినిపిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఆట తీరుతో అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకొని , తిరుగులేని ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ వచ్చిన రోహిత్ ని గత వారం అత్యంత అన్యాయంగా హౌస్ మేట్స్ ఓట్లతో తొలగించడం పై , ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోహిత్ ని వెనక్కి తీసుకొని రావాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. అయితే రోహిత్ రీ ఎంట్రీ ఈ వీకెండ్ లో కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆయన రీ ఎంట్రీ దాదాపుగా లేనట్టే అని జియో హాట్ స్టార్ పరోక్షంగా చెప్పేసింది.
ఎందుకంటే నేడు మధ్యాహ్నం 1 గంటకు రోహిత్ జియో హాట్ స్టార్ లైవ్ లో అభిమానులతో చాట్ చేసాడు. బిగ్ బాస్ లో జర్నీ ని పూర్తి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా లైవ్ చాట్ కి వస్తుంటారు , కాబట్టి రోహిత్ రీ ఎంట్రీ కచ్చితంగా లేనట్టే అని అంటున్నారు విశ్లేషకులు. అభిమానులు మీ రీ ఎంట్రీ ఉంటుందా అని రోహిత్ ని అడగ్గా, ఆయన ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం నన్ను రీ ఎంట్రీ కోసం అడగలేదని , సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. దీంతో గ్రాండ్ ఫినాలే రోజు గర్వంగా కప్పు పైకి ఎత్తాల్సిందే రోహిత్ అనే సామాన్యుడి జర్నీ ఇక్కడితో ముగిసినట్టే అనుకోవచ్చు. భవిష్యత్తులో ఇక ‘అగ్ని పరీక్ష’ షో కూడా ఉండే అవకాశాలు లేవట. రెండవ సీజన్ తోనే ముగించేయాలని , ఇక కేవలం సెలబ్రిటీలతో మాత్రమే బిగ్ బాస్ షో రన్ అవుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.