OG 2 Shooting Update: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆక్సిజన్ లాంటి చిత్రం ‘ఓజీ’. వరుస రీమేక్ సినిమాల కారణంగా పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఆడియన్స్ కి మాత్రమే కాదు , ఫ్యాన్స్ కి ఆసక్తి తగ్గే ప్రమాదం నెలకొన్న సమయం లో విడుదలైన ఈ ‘ఓజీ’ సినిమా ఇచ్చిన ఊపు సాధారణమైనది కాదు. నేటి తరం జెన్ జీ ఆడియన్స్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మార్చేసిన సినిమా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్షన్ , యాటిట్యూడ్ , స్టైల్ , స్వాగ్ ని నచ్చనోళ్లు అంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే డివైడ్ టాక్ వచ్చినా , సినిమాలో స్టోరీ బలంగా లేకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం తెలుగు వెర్షన్ నుండి 321 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓపెనింగ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కేవలం ప్రీ సేల్స్ నుండే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఈ సినిమా ఉంటుందో లేదో అనే భయం అభిమానుల్లో ఉండేది. అయితే స్వయంగా మొన్న పవన్ కళ్యాణ్ టీం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ చర్చ సుజిత్ ఇండియా కి రాగానే జరుగుతుందని అనడంతో ఫ్యాన్స్ లో ఆనందం ఆకాశాన్ని అంటింది.
ఇప్పుడు అందుతున్న మరో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే , ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక ప్రత్యేకమైన పోస్టర్ తో , పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు , అనగా సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నారని, నవంబర్ 27, 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి , ఆయన కోరిన విధంగా జపాన్ షెడ్యూల్స్ లో కూడా పాల్గొనడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ షెడ్యూల్స్ తన రాజకీయ కార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డు ఉండకుండా చూసుకోవాల్సిందిగా కోరాడట పవన్ కళ్యాణ్. అంటే సెప్టెంబర్ 2 నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరోసారి ఓజీ మేనియా లో మునిగి తేలబోతున్నారు అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది.

