Highest Nizam Share Collection Films: మన టాలీవుడ్ కి అత్యధిక వసూళ్లను రాబట్టే మార్కెట్స్ లో ఒకటి నైజాం. ఒకప్పుడు ఇక్కడ మన టాలీవుడ్ సినిమాలకంటే , బాలీవుడ్ సినిమాలు ఇరగబడి ఆడేవి. అమితాబ్ బచ్చన్ ని అప్పట్లో నైజాం కింగ్ అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే చిరంజీవి స్టార్ అయ్యాడో , అప్పటి నుండి మన టాలీవుడ్ డామినేషన్ ఈ ప్రాంతం లో మొదలైంది. చిరంజీవి తర్వాత ఆ తరంలో అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ ఈ ప్రాంతంలో రికార్డులు సృష్టించేవారు. ఇక నేటి తరం లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి వారు తిరుగులేని స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి ఈ హీరోలు అవలీలగా 100 కోట్ల గ్రాస్ మార్కుని కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగారు. అయితే ఈ ప్రాంతం లో లేటెస్ట్ గా ‘పెద్ది’ చిత్రం 50 కోట్ల షేర్ మార్కుని అందుకుంది.
అలా ఇప్పటి వరకు ఈ ప్రాంతం లో 50 కోట్ల షేర్ మార్కుని అందుకున్న సినిమాల జాబితాని ఒకసారి వివరంగా చూద్దాం. ముందుగా బాహుబలి 2 గురించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత అదే రాజమౌళి నుండి విడుదలైన #RRR చిత్రం నైజాం ప్రాంతం నుండి 176 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 111 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 71 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టగా , కల్కి చిత్రం ఏకంగా 92 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఈ ప్రాంతం లో 104 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించగా, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం 52 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం సూపర్ హిట్ గా నిల్చి 9 రోజుల్లో 50 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం 60 కోట్ల షేర్ మార్కుని కూడా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రేపటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్స్ తగ్గనున్నాయి, కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మూడవ వారంలో బలంగా కదులుతారని అంటున్నారు.

