spot_img
Homeబిజినెస్Renault Duster AMT Variant: తక్కువ ధరకే AMT కారు.. డస్టర్ తో కొత్త ప్రయోగం.....

Renault Duster AMT Variant: తక్కువ ధరకే AMT కారు.. డస్టర్ తో కొత్త ప్రయోగం.. ఏం చేస్తారంటే..

Renault Duster AMT Variant: కార్లు కొనాలని అనుకునేవారు అప్ గ్రేడ్ అయిన వాటిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే AMTకార్ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే వీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెనాల్ట్ (Renault) కంపెనీ నుంచి డస్టర్ (Duster) భారత్‌లో సరికొత్త అవతారంలో మళ్లీ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే కస్టమర్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని, రెనాల్ట్ సంస్థ డస్టర్‌లో సరికొత్త ‘ఎంట్రీ-లెవల్ ఆటోమేటిక్’ వేరియంట్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న కొత్త డస్టర్ బేస్ మోడల్ ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఆటోమేటిక్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారు 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ‘ఎవల్యూషన్’ వేరియంట్‌ను ఎంచుకోవాల్సి వస్తోంది. దీని ధర రూ.14.49 లక్షలుగా ఉంది. అంటే మాన్యువల్ బేస్ వేరియంట్‌కు, ప్రస్తుత ఆటోమేటిక్ వేరియంట్‌కు మధ్య దాదాపు రూ. 4 లక్షల భారీ వ్యత్యాసం ఉంది. ఈ పెద్ద గ్యాప్‌ లేకుండా మధ్యతరగతి కొనుగోలుదారులకు అందుబాటు ధరలో కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను తీసుకురావడమే రెనాల్ట్ ప్రధాన లక్ష్యం.

ఇందులో భాగంగా తక్కువ ధరలోనే ఆటోమేటిక్ వేరియంట్ కోసం కంపెనీ రెండు రకాల వ్యూహాలను పరిశీలిస్తోంది. వీటిలో మొదటిది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేయడం. రెండో ఆప్షన్‌గా ప్రస్తుతం ఉన్న 1.3-లీటర్ టర్బో పెట్రోల్ DCT ఆటోమేటిక్ సెటప్‌ను మరింత తక్కువ ఫీచర్లు ఉండే బేస్ ‘ఆథెంటిక్’ ట్రిమ్‌లో ప్రవేశపెట్టడం. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆటోమేటిక్ కార్లు కావాలనుకునే వారికి ఇదొక మంచి బడ్జెట్ ఆప్షన్ కానుంది.

ఇక ప్రస్తుత డస్టర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది రగ్గడ్ డిజైన్ ను కలిగి ఉంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తో పాటు అధునాతన సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 17 రకాల ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లతో వస్తోంది. ఈ పండుగ సీజన్ నాటికి డస్టర్‌లో సరికొత్త 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయాలని రెనాల్ట్ ప్లాన్ చేస్తోంది. ఈ లో బడ్జెట్ ఆటోమేటిక్ వేరియంట్ కనుక మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి గట్టి పోటీదారులకు డస్టర్ మరింత గట్టి పోటీనివ్వడం ఖాయం అని ఆటోమోబైల్ ప్రతినిధులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper