NTR-Kalyan Ram combo : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న మూవీ హీరోలు వాళ్ళ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వీళ్లు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడం లేదనీ అభిమానులు కొంతవరకు అసంతృప్తి అయితే అభిమానుల్లో ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు అంటు అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. మరి దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వలేకపోయారు. నిజానికి వీళ్లిద్దరిని పెట్టి పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అప్పట్లో పూరి కి వరుసగా ప్లాప్ రావడం తో ఈ మూవీ కార్యరూపం దాల్చలేదు. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ సైతం వీళ్ళిద్దరి మీద పెద్దగా ఫోకస్ అయితే చేయలేదు. ఇక ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం వల్ల ఆయన స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలైతే లేకుండా పోయాయనే చెప్పాలి…
Also Read: నందమూరి ఫ్యామిలీకి అసలైన వారసుడు ఎవరు..? మోక్షజ్ఞ ఎంట్రీ ఇక లేనట్టేనా..?
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదుగుతున్న క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఆయన అనుకున్న మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: బాలయ్య చేయాల్సిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఇక రాబోయే రోజుల్లో కళ్యాణ్ రామ్ కూడా మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలిగితే మంచిదని చాలామంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక రాబోయే రోజుల్లో ఎవరు ఎలాంటి విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీ లో గొప్ప పేరు తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది…