Nandamuri Family: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) మాత్రమే గుర్తుకొస్తాడు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన నటుడు కూడా తనే కావడం విశేషం… తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరు పడుతున్న క్రమంలో తెలుగులో మంచి సక్సెస్ లను సాధించి మన స్టామినా ఏంటో తమిళ్ వాళ్ళకు తెలియజేశాడు….ఇక పౌరాణిక పాత్రలను పోషించడంలో తనను మించిన వారు ఎవరు లేరు అనేంతల గొప్ప క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు…ఇక తన ఎంటైర్ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చినవి మాత్రం పౌరాణిక సినిమాలనే చెప్పాలి.తన నట వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో సీనియర్ ఎన్టీఆర్ చాలా వరకు ఆసక్తి చూపించాడు. బాలయ్య బాబును తన నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోగా మార్చడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు… ఇక బాలయ్య బాబు నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్తూ చాలావరకు మంచి సక్సెస్ లను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తారకరత్న లాంటి నటులు ఆశించిన మేరకు వాళ్ళ సత్తాను చాటిలేకపోయారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగి పాన్ ఇండియా లో తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తమ మూడోవ తరం వారసుడు కాదంటున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
దానికోసం తన కొడుకును రంగంలోకి దింపి నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) నే అని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయన చేయాలనుకుంటున్న సినిమా ఇప్పటివరకు స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇక ఆయన హీరోగా సినిమా చేస్తాడా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్నయ్య అయిన జానకిరామ్ కొడుకు సైతం ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం కూడా ఇండస్ట్రీకి వస్తున్న క్రమంలో మోక్షజ్ఞ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో సినిమా చేయడానికి ఎందుకు తడబడుతున్నాడు అనే ధోరణి లోనే కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళుతున్న చాలామంది స్టార్ హీరోలను ఢీ కొట్టి మరీ నందమూరి ఫ్యామిలీని ముందుకు నడిపించాలంటే అది ఒక ఎన్టీఆర్ వల్లే అవుతుందని మరి కొంతమంది భావిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి ఎవరికి వారు ఇండివిజువల్ గా ఉంటున్నప్పటికి ఆ ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు మాత్రం చెడగొట్టకుండా ముందుకు వెళ్తే మంచిదని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…