Nimisha Priya Yemen Case: మనదేశ మహిళ, నర్స్ నిమిష ప్రియ కు ఇటీవల యెమెన్ లోని న్యాయస్థానం ఇటీవల మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. యెమెన్ దేశానికి చెందిన ఓ పౌరుడు నిమిషప్రియ వల్ల చనిపోయాడని.. ఒక వ్యక్తి మరణానికి కారణమైన ఆమెకు జీవించే హక్కు లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.. అంతేకాదు ఆమెకు ఏకంగా మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆమె పేరుతో సేవ్ యాక్షన్ కౌన్సిల్ సంస్థ కూడా ఏర్పాటయింది.. ఆమె తరఫున శామ్యూల్ జెరోమ్ అనే వ్యక్తి కీలకంగా పనిచేస్తున్నాడు. యెమెన్ ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపాడు. ఆ చర్చలు ఇంతవరకు సఫలీకృతం కాలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!*
యెమెన్ అనేది పూర్తిగా ఇస్లాం దేశం. అక్కడ షరియా చట్టం అమల్లో ఉంటుంది.. అక్కడ న్యాయ వ్యవస్థ కూడా ఈ చట్టం ఆధారంగానే పనిచేస్తుంది.. గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి కేసులలో బాధిత కుటుంబం పరిహారం తీసుకోవడానికి ఒప్పుకుంటే.. అక్కడి న్యాయస్థానాలు నిందితులకు క్షమాభిక్షపెడతాయి. ద్వారా మరణశిక్ష రద్దయ్యే అవకాశాలుంటాయి. గతంలో చివరి నిమిషంలో కూడా అక్కడ మరణశిక్షలు రద్దు అయిన అబుదంతాలు ఉన్నాయి. ఇప్పటికే మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని నిమిష ప్రియ కుటుంబం ముందుకు వచ్చింది. ఇదే విషయాన్ని శామ్యూల్ జెరోమ్ యెమెన్ ప్రభుత్వ పెద్దలతో పేర్కొన్నాడు. నిమిష ప్రియను కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని వెల్లడించాడు. అయితే అతని మాటలను యెమెన్ ప్రభుత్వ పెద్దలు విన్నప్పటికీ.. అంతిమ నిర్ణయం మృతుడి కుటుంబం తీసుకోవాలని.. విషయంలో తాము ఏమీ చేయలేమని అక్కడి ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది అంతు పట్టకుండా ఉంది.
మరోవైపు నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దు చేసే విషయంలో చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన దారులు మొత్తం మూసుకుపోతున్నాయని తెలుస్తోంది.. ఆమెకు ఉరిశిక్ష పడకుండా కేంద్రం మధ్యవర్తిత్వం చేపట్టాలని.. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని ఒక పిటిషన్ దాఖలు అయింది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదు పై ప్రభుత్వ కౌన్సిల్ కేంద్రం తరఫున వాదనలు చేసింది..” యెమెన్ పూర్తి విభిన్నమైన దేశం. అక్కడ షరియా చట్టం అమల్లో ఉంటుంది. అక్కడ వ్యవస్థల మొత్తం ఆ చట్టం ఆధారంగానే పనిచేస్తాయి. నిమిషను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఇక ఈ విషయంలో కేంద్రం కూడా కొత్తగా చేయడానికి లేదు. అలాంటప్పుడు ఇంకా ఏదైనా అద్భుతం జరుగుతుందో చూడాల్సిందేనని” కౌన్సిల్ సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. మరవైపు ఈ నెల 16న నిమిషం ఉరిశిక్ష అమలు చేస్తారు. అక్కడి పౌరుడు నిమిష నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని.. ఆమె మీద అభియోగాలు నిరూపించడంలో యెమెన్ అధికారులు విజయవంతమయ్యారు. బలమైన సాక్ష్యాలను న్యాయస్థానం ఎదుట ఉంచారు. దీంతో నిమిషప్రియకు ఉరిశిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.