Homeఎంటర్టైన్మెంట్Dragon movie villain issue: ఎన్టీఆర్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో.....

Dragon movie villain issue: ఎన్టీఆర్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో.. ‘డ్రాగన్’ కష్టాలు మామూలుగా లేవుగా..

Dragon movie villain issue: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో ‘డ్రాగన్'(Dragon Movie) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ముహూర్తం లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారో తెలియదు కానీ , నాన్ స్టాప్ గా రీ షూట్స్ జరగడం , తీసిన సన్నివేశాలను పూర్తిగా తొలగించి, స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం వంటివి జరుగుతున్నాయి. […]

Dragon movie villain issue: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో ‘డ్రాగన్'(Dragon Movie) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ముహూర్తం లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారో తెలియదు కానీ , నాన్ స్టాప్ గా రీ షూట్స్ జరగడం , తీసిన సన్నివేశాలను పూర్తిగా తొలగించి, స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం వంటివి జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ నిర్మాత డబ్బులను మంచి నీళ్లు లాగా ఖర్చు చేస్తున్నాడు కానీ , సినిమా షూటింగ్ ని వేగవంతం చేయడం లేదు. ఇప్పటి వరకు ఎంత కంటెంట్ ని షూట్ చేశారో కూడా క్లారిటీ లేదు. మరో పక్క ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేయడం కోసం ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ముందుగా మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్ ని ఎంచుకున్నారు.

ఆయన ఈ సినిమా కోసం నెల రోజులపాటు పని చేశాడు. కానీ ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి, ఆ సన్నివేశాలను మొత్తం తొలగించి , ఫ్రెష్ గా మరోసారి ఎన్టీఆర్ – టోనీవో థామస్ లపై చిత్రీకరించాలని అనుకున్నాడు. కానీ టోనీవో డేట్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నా సమయాన్ని వృధా చేస్తున్నారు , ఈ ఒక్క సినిమా కోసం నేను మూడు సినిమాలను వదులుకోలేని అని బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం పెద్ద సంచలన టాపిక్ గా మారింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ ని సంప్రదించారు మేకర్స్. స్టోరీ విన్న తర్వాత ఆయన తన క్యారెక్టర్ కి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పి , ఇందులో నటించేందుకు నిరాకరించాడు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రతీ ఒక్కరు ఇందులో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీని అర్థం ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ని రాసుకోలేకపోయాడా?, అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన గత చిత్రం ‘సలార్ ‘ లో సెకండ్ హీరో గా పృథ్వీ రాజ్ నటించాడు. మేకర్స్ చివరికి ఆయన్ని కూడా సంప్రదించారట. కానీ డేట్స్ ఖాళీ లేవని ఆయన కూడా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. మరి రాబోయే రోజుల్లో ఎవరు ఈ సినిమా లో విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు అనేది చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper