Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh shocking story: కీర్తి సురేష్ అప్పట్లో ఇంత పెద్ద క్రైమ్ చేసిందా..ఎవరికీ తెలియని...

Keerthy Suresh shocking story: కీర్తి సురేష్ అప్పట్లో ఇంత పెద్ద క్రైమ్ చేసిందా..ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

Keerthy Suresh shocking story: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అద్భుతమైన నటించగల హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్(Keerthy Suresh). అందం , అభినయం ఒకే చోట ఉండడం చాలా అరుదు. ఆ రెండిట్లో కీర్తి సురేష్ కి కీర్తి సురేష్ నే పోటీ. నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక హీరోయిన్ గా ఆమెకు ఒక అరుదైన రికార్డు ఉంది. అయితే ఈమధ్య కాలం లో కీర్తి సురేష్ కి […]

Keerthy Suresh shocking story: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అద్భుతమైన నటించగల హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్(Keerthy Suresh). అందం , అభినయం ఒకే చోట ఉండడం చాలా అరుదు. ఆ రెండిట్లో కీర్తి సురేష్ కి కీర్తి సురేష్ నే పోటీ. నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక హీరోయిన్ గా ఆమెకు ఒక అరుదైన రికార్డు ఉంది. అయితే ఈమధ్య కాలం లో కీర్తి సురేష్ కి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘దసరా’ తర్వాత కీర్తి సురేష్ తెలుగు , తమిళం 7 చిత్రాలు విడుదల చేసింది. అందులో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రం లో నటిస్తోంది.

అంతే కాకుండా త్వరలోనే ఆమె వెంకటేష్ , అనిల్ రావిపూడి చిత్రం లో హీరోయిన్ గా నటించబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు , ‘ఎల్లమ్మ’ చిత్రం లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. చేతిలో మినిమం గ్యారంటీ మూవీస్ కాబట్టి , రాబోయే రోజుల్లో ఈమె భారీ కం బ్యాక్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే గతం లో కీర్తి సురేష్ జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ షోలో ఆమె ఎంత రెబెల్ గా ఉండేదో చెప్పుకొచ్చింది. గతం లో ఆమె ఒక క్రైమ్ చర్య కి తలపడినట్టు చెప్పుకొచ్చింది. అది కూడా ఇంటర్నేషనల్ టూర్ కి వెళ్లడం కోసం. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇంటర్నేషనల్ టూర్స్ కి వెళ్ళేటప్పుడు పాస్ పోర్ట్ ధ్రువీకరణ కోసం, ఫొటోలతో పాటు, సదరు వ్యక్తికి సంబంధించిన పుట్టుమచ్చలు కూడా పరిగణలోకి తీసుకుంటారు.

కానీ కీర్తి సురేష్ కి శరీరం లో ఒక్క పుట్టు మచ్చ కూడా లేదట. దీంతో ఆమె ఆర్టిఫీషియల్ గా ఒక పుట్టుమచ్చని క్రియేట్ చేసుకొని, వెళ్లాల్సి వచ్చింది. అలా ఎయిర్ పోర్ట్ అధికారులను బురిడీ కొట్టించి క్రైమ్ కి పాల్పడ్డాను అంటూ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. అంతే కాదు , ఆమె అనేక గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఒకసారి తన స్నేహితురాలితో కలిసి వెళ్తుంటే , ఒక అబ్బాయి ఆమె నడుము గిల్లి వెళ్లిపోయాడని, అది గమనించిన నేను అతని చెంప చెళ్లుమనిపించానని, అది వాడు మనసులో పెట్టుకొని దొంగచాటుగా వచ్చి నా నెత్తి మీద బలంగా కొట్టి పారిపోయాడని , అప్పుడు అతన్ని వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లానని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper