Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan next movie: పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం పై వీడిన మిస్టరీ.. పాపం...

Pawan Kalyan next movie: పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం పై వీడిన మిస్టరీ.. పాపం సురేందర్ రెడ్డి..

Pawan Kalyan next movie: ఒక్క ఫ్లాప్ కొంతమంది హీరోలను అలెర్ట్ చేస్తుంది. ‘రభస’ వంటి ఘోరమైన ఫ్లాప్ జూనియర్ ఎన్టీఆర్ లో ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుసగా 7 బ్లాక్ బస్టర్స్ ని అందుకొని, స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఎన్టీఆర్ తోపు రేంజ్ కి చేరిపోయాడని అంతా అనుకునేలా చేశారు. అదే విధంగా ‘స్పైడర్’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు లో కూడా మార్పులు వచ్చింది. వరుసగా […]

Pawan Kalyan next movie: ఒక్క ఫ్లాప్ కొంతమంది హీరోలను అలెర్ట్ చేస్తుంది. ‘రభస’ వంటి ఘోరమైన ఫ్లాప్ జూనియర్ ఎన్టీఆర్ లో ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుసగా 7 బ్లాక్ బస్టర్స్ ని అందుకొని, స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఎన్టీఆర్ తోపు రేంజ్ కి చేరిపోయాడని అంతా అనుకునేలా చేశారు. అదే విధంగా ‘స్పైడర్’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు లో కూడా మార్పులు వచ్చింది. వరుసగా మినిమం గ్యారంటీ కమర్షియల్ సినిమాలు చేస్తూ , ఫ్లాప్స్, డిజాస్టర్స్ పడకుండా చూసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘నా పేరు సూర్య’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత , ఆయన ఎలాంటి సినిమాలు చేశాడో, ఏ రేంజ్ కి వెళ్ళాడో కళ్లారా చూశాము, చూస్తున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చేసింది.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఎంపిక విషయం లో అలెర్ట్ అయ్యాడు. జెన్ జీ యూత్ ఆడియన్స్ తన నుండి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో ఆయనకు ‘ఓజీ’ తోనే అర్థం అయ్యింది. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎప్పుడో నాలుగేళ్ల క్రితం కమిట్ అయిన చిత్రం కావడంతో ఆయన ఆ చిత్రాన్ని పూర్తి చేయక తప్పలేదు. కానీ ఇక మీదట ఆయన ఎంపిక చేసుకునే స్క్రిప్ట్స్ చాలా సెలెక్టివ్ గా ఉండబోతున్నాయి. అందుకే ఆయన తదుపరి చిత్రం పై ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క ప్రకటన కూడా చెయ్యలేదు. సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19 న ప్రారంభించాలని అనుకున్నారు.

కానీ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ఆయనకు పెద్దగా నచ్చకపోవడంతో , సురేందర్ రెడ్డి కి కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచించాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అదే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా మెప్పించాలి అనే కసితో ఆయన అమరావతి లో ఒక ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేసి, తన టీం తో కలిసి స్క్రిప్ట్ లో తుది మెరుగులు దిద్దుతున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు, పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ నే మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. డైరెక్టర్ సుజిత్ కూడా తన రైటింగ్ టీం తో ప్రీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని పూర్తి చేసాడు. ఈ డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కచ్చితంగా ‘ఓజీ 2’ నే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper