Homeఎంటర్టైన్మెంట్అంచనాలు పెంచుతున్న కొత్త డైరెక్టర్ !

అంచనాలు పెంచుతున్న కొత్త డైరెక్టర్ !

ప్రముఖ దర్శకుడు ‘గౌతమ్ మీనన్’ అసోసియేట్ ‘రమేష్ దేశిన’ దర్శకత్వంలో ఆర్.కె సాగర్ హీరోగా రానున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇండస్ట్రీలో అంచనాలు పెరుగుతున్నాయి. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనం యాడ్ అయితే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రమేష్ దేశిన – ఆర్కే సాగర్’ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాలో రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీ సినిమాలో మెయిన్ హైలైట్ అని, అలాగే ఆ పాత్రలను […]

Ramesh
ప్రముఖ దర్శకుడు ‘గౌతమ్ మీనన్’ అసోసియేట్ ‘రమేష్ దేశిన’ దర్శకత్వంలో ఆర్.కె సాగర్ హీరోగా రానున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇండస్ట్రీలో అంచనాలు పెరుగుతున్నాయి. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనం యాడ్ అయితే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రమేష్ దేశిన – ఆర్కే సాగర్’ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాలో రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీ సినిమాలో మెయిన్ హైలైట్ అని, అలాగే ఆ పాత్రలను చూపించిన విధానం కూడా చాల బాగా కుదిరిందని తెలుస్తోంది.

Also Read: శివ‌రాత్రి కాదు.. సినిమాల ‌రాత్రి.. వ‌చ్చేస్తున్న కొత్త సినిమాలు ఇవే!

ముఖ్యంగా దర్శకుడు రమేష్ దేశిన రాసుకున్న స్క్రీన్ ప్లే చాల వినూత్నంగా ఉంటుందని.. కథలోని ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుందని టాక్. నిజానికి సస్పెన్స్ థ్రిల్లర్ లో ఎమోషన్ని హ్యాండిల్ చేయడం చాల కష్టం, అలాంటిది ఈ సినిమాలో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయట. పైగా లవ్ ట్రాక్ కూడా వెరీ ఇంట్రస్టింగ్ ప్లేతో సాగుతుందట. అసలు ప్రేమ కథలో అద్భుతమైన సస్పెన్స్ ను పెట్టడం అంటే మాటలా..

అన్నిటికికంటే మెయిన్ గా కొత్త అనుభూతిని కలిగిస్తూ కూడా కొత్త కథను థ్రిల్ చేస్తూ చెప్పడం.. అలాగే అనేక భావోద్వేగాల సమ్మేళనాలను ఒక పాత్ర చుట్టూ క్రియేట్ చేసి చెప్పడం అంటే.. అది చాలా అరుదుగా జరుగుతుంది. అది ఈ సినిమాకి జరిగింది కాబట్టే.. సినిమా ఇంకా పూర్తీ కాకముందే ఈ సినిమా పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ వచ్చేసింది.

Also Read: RRR రిలీజ్ సంక్రాంతికా..? మ‌హేష్‌-ప‌వ‌న్ ఏం చేస్తారు?

మొత్తానికి ఈ సినిమాకి వస్తోన్న ఈ బజ్ ను చూస్తే.. తెలుగు వైవిధ్యమైన న్యాచురల్ సినిమాల్లో ఈ సినిమా మరో సినిమాగా నిలిచిపోయేలా ఉంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఏది ఏమైనా కొత్త డైరెక్టర్ అయినా రమేష్ దేశిన తన మొదటి సినిమాతోనే అంచనాలు పెంచుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper