Homeఎంటర్టైన్మెంట్Namrata Shirodkar serious on Rajamouli: 'వారణాసి' షూటింగ్ లో జరిగిన దానికి రాజమౌళి మీద...

Namrata Shirodkar serious on Rajamouli: ‘వారణాసి’ షూటింగ్ లో జరిగిన దానికి రాజమౌళి మీద సీరియస్ అయిన నమ్రత..?

Namrata Shirodkar serious on Rajamouli: ఒక సినిమాతో సక్సెస్ ని సాధించాలి అంటే చాలా ఘట్స్ ఉండాలి. తన టాలెంట్ ను నమ్ముకొని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయగలిగే కెపాసిటి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఒక దర్శకుడు సినిమాని సక్సెస్ ఫుల్ గా తీయగలుగుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శక ధీరుడిగా తనకంటూ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు […]

Namrata Shirodkar serious on Rajamouli: ఒక సినిమాతో సక్సెస్ ని సాధించాలి అంటే చాలా ఘట్స్ ఉండాలి. తన టాలెంట్ ను నమ్ముకొని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయగలిగే కెపాసిటి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఒక దర్శకుడు సినిమాని సక్సెస్ ఫుల్ గా తీయగలుగుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శక ధీరుడిగా తనకంటూ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న ఏకైక దర్శకుడిగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కూడా తనే కావడం విశేషం…చేసిన అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది మామూలు విషయం కాదు… ఇక రీసెంట్ గా వారణాసి సినిమా షూటింగ్లో మహేష్ బాబు కి ఒక చిన్న గాయమైతే అయిందట. దానివల్ల కొద్దిరోజులు షట్ కి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ విషయం తెలుసుకున్న నమ్రత మాత్రం రాజమౌళిని పిలిచి మరి అతనితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా జరిగిందో తెలుసుకొని వాళ్ళకి ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అంటూ తను వార్నింగ్ ఇచ్చిందట. మొత్తానికైతే రాజమౌళి అత్యంత ప్రస్తేజీయస్ గా తీసుకొని చేస్తున్న ఈ సినిమా విషయంలో మహేష్ బాబు తో పాటు నమ్రత కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అవుతుంది.

ఈ సినిమా ఎలా వస్తుందనే విషయాన్ని కూడా తను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందట. మహేష్ బాబు సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడమే తన బాధ్యత అంటూ నమ్రత పలు సందర్భాల్లో తెలియజేసింది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఆమె చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తుందట…

ఇక రాజమౌళి టీం లో ఉన్నవాళ్ళ వల్ల జరిగిన కొన్ని పొరపాటుతో మహేష్ బాబు కి గాయం అయిందట. ఇక మరోసారి ఇది రిపీట్ అవ్వద్దు అని నమ్రత వాళ్లకు చెప్పిందట. దీని మీద రాజమౌళి ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికి ఇది నిజమా లేదంటే కావాలనే కొంతమంది ఇలాంటి న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper